Actors Remuneration : పది నిమిషాల లోపే క్యారెక్టర్ వంద కోట్ల పారితోషికం.. అట్లుంటది మరి ఆ నటుడితోని

Actors Remuneration

Actors Remuneration

Actors Remuneration : తెలుగుతో పాటు హిందీ, మలయాళ, తమిళ్, కన్నడ చిత్రాలు ప్రస్తుతం ఓ రేంజ్ లో ఆడుతున్నాయి. థియేటర్లకు వెళ్లి చూసేవారు తగ్గినా.. ఓటీటీ ఫ్లాట్ ఫాం ద్వారా వందల సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అందులో విజయవంతమై ఫేమస్ అవుతున్న నటులు కూడా ఉన్నారు. ముఖ్యంగా స్టార్ హిరోలు కూడా కొన్ని సార్లు ఓటీటీ మూవీలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 

అయితే ఒక హిరో మాత్రం కేవలం పది నిమిషాలు ఉన్న క్యారెక్టర్ కే దాదాపు రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఆయన మెగాస్టార్ చిరంజీవి, తలైవా రజినీకాంతా అంటూ నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. దీనికి సంబంధించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ అయి ఇప్పటికే 800 కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టి 1000 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. 

షారూక్ ఖాన్ కు గతేడాది బాగా కలిసొచ్చింది. రూ. 1050 కోట్లు పఠాన్ మూవీ ద్వారా.. మరో 1000 కోట్లు జవాన్ మూవీ ద్వారా మరో 450 కోట్లు డంకీ మూవీ ద్వారా కలెక్ట్ చేశారు. షారూక్ కెరీర్ లో ఇదే అతి పెద్ద మూవీలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. రజినీ కాంత్ కు జైలర్ మూవీ చేసినందుకు రూ. 250 కోట్లకు పైగా పారితోషికం ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. 

ప్రభాస్ కు వేరే రేంజ్ లో పారితోషికం ముడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విలక్షణ నటుడు కమల్ హాసన్ మాత్రం కల్కి లో చేసిన రోల్ కోసం ఏకంగా వంద కోట్లు తీసుకున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. కేవలం పది నిమిషాల లోపే నిడివి ఉన్న క్యారెక్టర్ అయినా.. ఇంత పారితోషికం వసూలు చేయడం కమల్ హాసన్ కే చెల్లిందని ఇండస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి. అయితే సినీ దర్శక నిర్మాతలు మాత్రం ఈ క్యారెక్టర్ ను కేవలం కమల్ హాసన్ మాత్రమే చేయగలడని విశ్వాసం పెట్టుకున్నారని అందుకే ఎంత డిమాండ్ చేసినా ఇచ్చేశారని తెలుస్తోంది.

TAGS