సురేఖ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డ సామెత లాగా.. కొండా సురేఖ, కేటీఆర్ ఒకరినొకరు ధూషించుకునే క్రమంలో మధ్యలో సమంతను తీసుకురావడం బాగాలేదన్నారు. సమంత, నాగ చైతన్య విడాకుల విషయం వారి పర్సనల్.. దాన్ని మధ్యలోకి తీసుకువచ్చి అక్కినేని కుటుంబ పరువు దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడంపై సర్వాత్ర నిరసన వ్యక్తమైంది. కొండా వ్యాఖ్యలకు అక్కినేని కుటుంబంతో పాటు సమంత ఖండించారు. పైగా దీనిపై చిత్ర సీమలోని నటులు స్పందిస్తున్నారు.
‘వ్యక్తిగత జీవితాలను గొడవల మధ్యలోకి తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ఇండస్ట్రీపై నిరాధార ప్రకటనలు చేయడం బాధాకరం. నిర్లక్ష్య ప్రవర్తనను సమాజం హర్షించదు’ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.
‘నాయకులు అర్థం పర్థంలేని వ్యాఖ్యలు చేయడంపై అసహ్యం వేస్తోంది. సమాజంపై చెడు ప్రభావం చూపే ఇలాంటి చర్యలను ఖండించాలి’ అని న్యాచురల్ స్టార్ నాని ట్వీట్ చేశారు. వీరిద్దరే కాదు.. అనేక మంది సినీ ప్రముఖులు కొండా వాఖ్యాలను ఖండించారు.
అటు ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఎవరూ కొండా మాటలను సమర్థించడం లేదు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి కూడా ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆమె ప్రవర్తనను తప్పుపట్టారు. తన తప్పును తెలుసుకున్న సురేఖ వ్యాఖ్యలని వెనక్కి తీసుకున్నారు.
కొండా ఉపసంహరణ స్టేట్‌మెంట్‌లో స్పష్టత లేదు. ఆమె సమంత పేరునే ప్రస్థావించినా ఆమె వాఖ్యలు నాగార్జున వ్యక్తిత్వాన్ని చులకన చేశాయి. కానీ కొండా మాత్రం సమంతే తన వ్యాఖ్యలతో కలత చెందారంటున్నారు.
పైగా మీడియా కూడా వీడియో బైట్ రూపంలో అడ్డగోలు ఆరోపణలు చేసి, ఇప్పుడు ట్విట్టర్ లో ఉపసంహరణ అంటూ పోస్ట్ పెట్టడం తగదు. ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలిసేలా అక్కినేని కుటుంబానికి, సమంతకు క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని సమంత, అక్కినేని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తు్న్నారు.