Winter Sessions : నవంబరు 25 నుంచి శీతాకాల సమావేశాలు: రిజిజు

Winter Sessions

Winter Sessions

Winter Sessions : పార్లమెంట్ శీతాకాల సమావేశాల గురించి కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబరు 25 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 20 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం తెలిపారు. ఈ సెషన్ లో భాగంగా నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. సంవిధాన్ సదన్ (పార్లమెంట్ పాత భవనం) సెంట్రల్ హాల్ ఇందుకు వేదికకానుంది.

ప్రస్తుతం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. నవంబరు 23న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆ తర్వాతే ఈ సెషన్ ప్రారంభం కానుంది. ఈ సమావేశాల్లోనే కేంద్రం వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. గత సెషన్ లోనే కేంద్రం ఈ బిల్లును తీసుకు వచ్చింది. అయితే విపక్షాలు దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో కేంద్ర ఒక్క అడుగు వెనక్కివేసి.. దానిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపింది.

TAGS