Heritage Shares : హెరిటేజ్ షేర్లకు రెక్కలు.. రూ.1200 కోట్లు లాభం

Heritage Shares
Heritage Shares : ఏపీలో టీడీపీ తిరిగి అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడుకు సంబంధించిన హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు డబులు అయ్యాయి. మే 23న రూ.354.5 ఉన్న షేర్ విలువ ఇప్పుడు డబుల్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మే 23న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి (24.37%), కుమారుడు నారా లోకేశ్ (10.82%)ల షేర్ల విలువ రూ.1,100 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.1200 కోట్లు పెరిగి రూ.2,300 కోట్లకు చేరింది.
1992లో హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ ప్రారంభమైంది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ కంపెనీకి వ్యవస్థాపకులుగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ప్రస్తుతం ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా నారా భువనేశ్వరి ఉన్నారు.
TAGS AP newsChandrababuHeritage FoodsHeritage Foods share ValueHeritage SharesNara BhuvaneshwariNara LokeshTDP