YS Vijaya Lakshmi : ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టిన మూడో రోజు నుంచే ప్రచారం ప్రారంభించారు వైఎస్ షర్మిల. దీనిలో భాగంగా వైఎస్ జగన్ ను నేరుగా ఢీ కొంటుంది. ప్రభుత్వ పథకాలు అమలుపై నిలదీస్తుంది. ఈ నేపథ్యంలో షర్మిలను అడ్డుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది.
వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కొండా రాఘవ రెడ్డిని షర్మిలను టార్గెట్ చేసేందుకు జగన్ రంగంలోకి దింపారు. దీంతో రాఘవరెడ్డి ఆమెపై విరుచుకుపడడం ప్రారంభించాడు. ఎవరూ అడగకపోయినా షర్మిల స్వచ్ఛందంగా పాదయాత్ర చేశారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల, ఆమె భర్త డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించారని, జగన్ అనుమతించకపోవడంతో కోపంగా ఉన్నారని ఆరోపించారు.
ఈ ఆరోపణలపై షర్మిల స్పందించారు.
ప్రమాణ స్వీకారం తర్వాత వ్యక్తి గత, కుటుంబ విషయాలలోనే తప్ప నేను, నా భర్త జగన్ ను కలవలేదన్నారు. అది కూడా మా అమ్మ విజయమ్మతోనే జగన్ ను కలిశాను. నేను నా పిల్లలపై, నేను నమ్మిన దేవుడిపై ప్రమాణం చేయగలను. వారు అలా చేయగలరా..? వీటన్నింటికీ మా అమ్మ విజయమ్మే సాక్ష్యం దమ్ముంటే జనగ్ ను ఆమెతో మాట్లాడేలా చేయండి’ అని షర్మిల సవాల్ విసిరారు.
రాబోయే రోజుల్లో షర్మిల మరిన్ని సమస్యలు, బురద జల్లాల్సి ఉంటుంది. ఆమె వైఎస్సార్ కూతురు కాదంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఆమెపై హేయమైన కామెంట్ల ను చూస్తూనే వస్తున్నాం. అన్నచెల్లిల మధ్య గొడవ విజయ లక్ష్మి పేరు పదే పదే వినిపిస్తోంది. షర్మిల పెద్దగా మద్దతు లేకుండా ఒంటరి పోరాటం చేస్తున్నారు. మరి విజయలక్ష్మి ఎప్పుడైనా ఈ ఇష్యూలోకి వచ్చి ఆమెకు అండగా నిలుస్తుందా? లేక తన కుమారుడికి లాభం చేకూర్చేలా వదిలేస్తుందో చూడాలి.