T20 World Cup : విరాట్, రోహిత్ టీ20 వరల్డ్ కప్ లోకి వస్తారా?
T20 World Cup : టీమిండియా వరల్డ్ కప్ ను చేజార్చుకుంది. దీంతో 2024లో టీ20 వరల్డ్ కప్ ఆడనుంది. దీంతో క్రీడాకారులపై అందరి ఫోకస్ పడుతోంది. వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో వరల్డ్ కప్ చేజారింది. ఎన్నో ఆశలతో బరిలో దిగిన భారత్ తగిన పోటీ ఇవ్వకపోవడం అందరిని బాధించింది. వరల్డ్ కప్ కోల్పోవడం పెద్ద దెబ్బే.
వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం ఆటగాళ్లను ఎంపిక చేయనుంది. టీ20 వరల్డ్ కప్ కు రోహిత్ శర్మ, కోహ్లిలను దూరం పెడతారనే వాదనలు వస్తున్నాయి. కానీ బీసీసీఐ వారికి మరో అవకాశం ఇవ్వాలని చూస్తోందని తెలుస్తోంది. దీంతో వారిని టీ20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. వారి ఎంపిక వారి ఇష్టం మీదే ఆధారపడి ఉందని అంటున్నారు.
వారు ఆడాలని అనుకుంటే చాన్స్ ఇస్తారని చెబుతున్నారు. కొందరేమో వారికి వయసు పైబడింది కాబట్టి కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ కు వారిద్దరిని ఎంపిక చేస్తారా? లేదా? అనేది అనుమానమే. దీంతో వారి మనుగడ ప్రశ్నార్థకంలో పడింది. వయోభారంతో వారు మైదానంలో సరిగా కదలలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
2022 టీ 20 తరువాత వీరు ఆడలేదు. అందుకే వీరిని పక్కన పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు 2024లో జరిగే టీ20 వరల్డ్ కప్ లో మాత్రం వీరిద్దరిని జట్టులోకి తీసుకుంటారనే అనుకుంటున్నారు. టీ20ల నుంచి విరాట్, రోహిత్ తప్పుకుంటారని ఇన్నాళ్లు అనుకున్నారు. కానీ వారు మళ్లీ జట్టులోకి వస్తారని తాజా సంకేతాలు తెలియజేస్తున్నాయి.