Interesting Survey : ఆ 22 సీట్లే విజేతను తేలుస్తాయా?.. ఆసక్తి కలిగిస్తున్న సర్వే
Interesting Survey : తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రోజురోజుకు సమీకరణలు మారుతున్నాయి. ఏ పార్టీ విజయం సాధిస్తుందో అనే ఉత్కంఠ అందరిలో రగులుతోంది. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో నెగ్గాలని మూడు పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడుతున్నాయి. ఇందులో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి.
ఓటర్లను ప్రభావితం చేసుకునే పనిలో పడ్డాయి. తాము ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని పథకాలు ప్రజలను ఆకట్టుకుంటాయని బీఆర్ఎస్, కాంగ్రెస్ లు నమ్ముతున్నాయి. దీంతో బీజేపీ మాత్రం ఎలాంటి పథకాల ఊసే లేకుండా ప్రధానమంత్రి చరిష్మానే నమ్ముకుని ముందుకు నడుస్తోంది. దీంతో రాజకీయ పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారుతోంది. ఓటర్లు మాత్రం ఉచితాలు ఇచ్చే పార్టీలను దూరం చేయాలనే ఆలోచలోనే ఉన్నట్లు మరో వాదన వినిపిస్తోంది.
ప్రస్తుతం సర్వేల హవా నడుస్తోంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో పలు సంస్థలు సర్వేలు చేపడుతున్నాయి. ఏ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది? ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకుంటారనే అంచనాలు కడుతున్నాయి. అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీనే అధికారం చేజిక్కించుకుంటుందని చెబుతున్నాయి. ఈనేపథ్యంలో సీట్ల విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి.
డెమోక్రసీ టైమ్స్ నెట్ వర్క్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్ కు 42, బీఆర్ఎస్ కు 45, బీజేపీకి 4, ఎంఐఎంకు 6 సీట్లు వస్తాయని తెలియజేస్తోంది. అయితే మిగతా 22 సీట్ల విషయంలోనే పీటముడి పడింది. ఈ సీట్లలో ఎవరు విజయం సాధిస్తారనే స్పష్టత రావడం లేదు. ఈ సీట్ల విషయంలో పలు విధాలుగా చర్చలు వస్తున్నాయి.
— Democracy Times Network (@TimesDemocracy) November 12, 2023