Star War continues : ఈ లెజెండ్ వివాదానికి ముగింపు పలికేదెన్నడో..? 20 ఏళ్లుగా కొనసాగుతున్న స్టార్ వార్..!

Star War continues

Star War continues

Star War continues : టాలీవుడ్ లో  మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు  ఇద్దరూ ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో పైకి వచ్చిన వారే. ఇద్దరూ కెరీర్ మొదట్లో విలన్లుగా చేసి ఆ తర్వాత హీరోలుగా స్టార్ హోదాను పొందారు. కమర్షియల్ గా చిరంజీవి ఎక్కువగా విజయాలు సాధించారు. అలాగే మోహన్ బాబు ఒకే సమయంలో అటు విలన్ గా నటిస్తూనే, ఇటు హీరోగా విజయాలు సాధించాడు.

కానీ సినీ ఫంక్షన్లలో వీరి మాటలు ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలనే  పట్టుదల కనిపిస్తుంటుంది. కానీ ఇద్దరూ కలిసినప్పుడు అంతా బాగానే ఉందన్నట్లుగా కవర్ చేస్తుంటారు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం మొదలైన గొడవ ఇంకా రగులుతూనే ఉన్నదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఇటీవల ఏఎన్ఆర్ అవార్డుల ఫంక్షన్లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో మరోసారి విభేధాలు  బహిర్గతమయ్యాయి.

తెలుగు సినిమా రజనతోత్సవ  చిరంజీవికి లెజెండరీ అవార్డు ప్రకటించారు. చిరంజీవి కన్నా ముందు హీరోలుగా చేసిన లెజెండరీ యాక్టర్లు కాదా? అసలు లెజెండరీ అవార్డుకు అర్థం ఏమిటో చెప్పాలంటూ వేదికపైనే నిలదీశారు. దీంతో చిరంజీవి ఆ అవార్డున తీసుకోకుండా పెట్టేలో వేశారు. తనకు అవార్డు తీసుకునే అర్హత వచ్చిన తీసుకుంటానని చెప్పాడు. ఇటీవల ఏఎన్ఆర్ అవార్డుకు ఎంపిక చేయడంతో నాటి సంగతిని చిరంజీవి గుర్తు చేసుకున్నాడు. దీంతో ఇద్దరి హీరోల అభిమానుల మధ్య మరోసారి రచ్చ మొదలైంది.గతంలో రెండు వర్గాలుగా చీలిన తెలుగు ఫిలిం  ఇండస్ట్రీ మరోసారి చీలనుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ లెజెండరీ అవార్డుకు ముగింపు పలికెదెన్నడోనని సినీ పరిశ్రమలోని పలువరు నటీనటులు చర్చించుకుంటున్నారు.

TAGS