YS Sharmila : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు మారుతున్నాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో ఆసక్తికరంగా మారింది. వైఎస్ కూతురుగా జగన్ వెంట నిలవాల్సిన చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం మరింత పెరగనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
షర్మిలను కాంగ్రెస్ చీఫ్ గా నియమించేందుకు సిద్ధమయ్యారు. దీనికి గాను ప్రస్తుత చీఫ్ గిడుగు రుద్రరాజు చేత రాజీనామా చేయించారు. ఇక షర్మిలను అధికారికంగా పీసీసీ అధ్యక్షురాలుగా నియమించడమే తరువాయి. ఆమె ఆధ్వర్యంలో పార్టీని గెలిపించుకోవాలని భావిస్తోంది. ఈనేపథ్యంలో ఆమె కడప లోక్ సభ లేదా పులివెందుల నుంచి పోటీలో నిలుస్తారనే వాదనలు వస్తున్నాయి.
షర్మిల కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారని నమ్ముతున్నారు. ఈ క్రమంలో జగన్ తో ఉండాల్సిన షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో వారి తల్లి విజయమ్మ ఎటు వైపు ఉంటారనే ప్రశ్నలు వస్తున్నాయి. జగన్ తన కుటుంబాన్ని పట్టించుకోవడం లేదనే కారణంతోనే షర్మిల పార్టీ మారినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తాజా పరిణామాలు సినిమా కథను మరిపిస్తున్నాయి.
జగన్ తీరుతో పార్టీ మారే నేతలు పెరుగుతున్నారు. దీంతో వారు టీడీపీలో చేరేందుకు ఇష్టపడటం లేదు. అందుకే వారు కాంగ్రెస్ లో చేరతారని తెలుస్తోంది. 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయోననే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఉన్న జగన్ కు అనుకూల పరిస్థితులు కనిపించడం లేదనే సమాచారం.