Crucial Final Toss : ఫైనల్ లో టాసే కీలకంగా మారనుందా?
Crucial Final Toss : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది. గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. దీంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేగుతోంది. మ్యాచ్ లో టాస్ కీలకం కానుంది. ఇదివరకే ఇండియాపై టాస్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్న పాకిస్తాన్ ఇవాళ టాస్ గురించి ఏం చెబుతుందోననే అనుమానాలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో నేడు టాస్ కీలకం కానుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
వరల్డ్ ఫైనల్ లో టాస్ ఓడిపోవడం కీలకం అట. భారత్ గెలిచిన రెండు వరల్డ్ కప్ ల్లోనూ టాస్ ఓడిపోయింది. దీంతో టాస్ ఓటమే జట్టు విజయం కలిగిస్తుందని నమ్ముతున్నారు. టాస్ గెలిచిన జట్టు మాత్రం కచ్చితంగా బ్యాటింగ్ ఎంచుకుంటుంది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ చేయడానికే ఇష్టపడుతుందని అంచనా వేస్తున్నారు.
గత 12 వరల్డ్ కప్ లను పరిశీలిస్తే టాస్ ఓడిన జట్టే ఎక్కువ సార్లు (8) విజేతగా నిలిచినట్లు తెలుస్తోంది. దీంతో టాస్ ఓడిపోవడమే గెలుపుకు చిహ్నంగా భావిస్తున్నారు. టాస్ గెలిచిన జట్టు కేవలం నాలుగు సార్లు మాత్రం కప్ గెలిచింది. ఇప్పటివరకు ఇండియా గెలిచిన రెండు సార్లు కూడా టాస్ ఓడిపోవడమే గమనార్హం. నేడు జరిగే ఫైనల్ లో టాస్ కీలకం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ కు ఇప్పటికే అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. దేశమంతా భారత్ గెలవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఫైనల్ చేరడంతో ఒక్క అడుగుదూరంలో భారత్ నిలిచింది. ఈ అడుగు విజయవంతంగా వేస్తే కప్ మన సొంతం అవుతుంది. ఈసారి అవకాశాలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంతో ఉండొద్దు. కప్ ను ముద్దాడే అవకాశాన్నిచేజార్చుకోవద్దని సూచిస్తున్నారు.