Liquor Policy : ఏపీలో కొత్త ప్రభుత్వం వస్తే లిక్కర్ పాలసీ మారుస్తుందా?
Liquor Policy : ఏపీ ఎన్నికలు ముగిసి అందరూ జూన్ 4న ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తామే అధికారంలోకి రాబోతున్నామని ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ కూటమి నేతలు ప్రకటిస్తుండడం తెలిసిందే. అంతే కాదు ఏకంగా ప్రమాణ స్వీకార ముహూర్తాలను, వేదికలను కూడా ఇప్పుడే ఫిక్స్ చేసుకుంటున్నారు. ఎవరి ధీమా ఎలా ఉన్నా..అసలైన విజేత ఎవరో జూన్ 4 నాడే తెలియనుంది.
ఫలితాల వెల్లడి తర్వాత అధికారంలోకి ఏ పార్టీ వస్తే ఏం చేస్తుందో అనే ఊహగానాలు ఇప్పుడే మొదలయ్యాయి. అందులో ప్రధానమైనది లిక్కర్ పాలసీ. జగన్ అధికారంలోకి వచ్చే దాక లిక్కర్ పాలసీ ఓ రకంగా ఉండేది. అంటే లిక్కర్ ప్రైవేట్ వారి చేతుల్లో ఉండేది. జగన్ వచ్చాక లిక్కర్ పాలసీని పూర్తిగా మార్చేశారు. లిక్కర్ ను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొచ్చారు. గతంలో ఉన్న బ్రాండ్లను రద్దు చేసి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. అలాగే మద్యం రేట్లను భారీగా పెంచారు. అయితే ఈ లిక్కర్ విధానం ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చింది గానీ ప్రజల ఆరోగ్యం ఖూనీ అయ్యింది..
పేదల జేబులు ఖాళీ అయ్యాయి. సంక్షేమ పథకాల ద్వారా వచ్చిన డబ్బులు..మందు ఖర్చులకు, హాస్పిటల్ ఖర్చులకే పెట్టుకోవాల్సి వచ్చింది. చెత్త బ్రాండ్లను తీసుకొచ్చి తమతో తాగిస్తున్నారని మందుబాబులు ఎంతగానో మొత్తుకున్నా జగన్ రెడ్డి వినలేదు. దీంతో లిక్కర్ పాలసీపై ప్రజలే కాదు..ప్రతిపక్షాలు బాగానే పోరాటం చేశాయి. ఇక జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ లిక్కర్ విధానాన్నే కొనసాగిస్తారు.
ఇక కూటమి అధికారంలోకి వస్తే కచ్చితంగా లిక్కర్ పాలసీని మారుస్తుంది. గతంలో లాగానే లిక్కర్ విధానాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. లిక్కర్ రేట్లు తగ్గించడంతో.. 2019కి ముందు ఉన్న నాణ్యమైన బ్రాండ్లనే కొనసాగించవచ్చు. వీటిపై కూటమి నేతలు ప్రకటించారు కూడా. ఎన్నికల ఫలితాల్లో గెలిచే పార్టీని బట్టి లిక్కర్ పాలసీ ఉండడం మాత్రం ఖాయం.