Lucknow VS Rajasthan : రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ గెయింట్స్ మధ్య శనివారం సాయంత్రం లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయీ ఎకానా స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు రెండు జట్లు నాలుగు సార్లు తలపడగా.. రాజస్థాన్ రాయల్స్ మూడు సార్లు, లక్నో ఒక్క సారి మాత్రమే గెలుపొందింది. ఈ నాలుగు మ్యాచుల్లో కూడా మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలవడం గమనార్హం.
అయితే లక్నో పిచ్ కాస్త స్లోగా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో 94/7 తో లక్నో తడబడగా.. ఆయుష్ బదోని 55 పరుగులతో గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అయితే ఢిల్లీ సెకండ్ బ్యాటింగ్ లో ఆ స్కోరును అలవోకగా చేజ్ చేసేసింది.రాజస్థాన్ రాయల్స్ లో ఇద్దరు ఓపెనర్లు తిరిగి ఫామ్ లోకి రావడం జట్టుకు మరింత బలాన్నిస్తోంది. ముంబయి తో మ్యాచ్ లో యశస్వి జైశ్వాల్ సెంచరీతో చెలరేగి ఫామ్ లోకి వచ్చాడు. బట్లర్ కోల్ కతాపై సెంచరీ చేసి 223 పరుగుల టార్గెట్ ను ఛేదించాడు.
ఇలా సెంచరీలతో చెలరేగుతున్న ఈ జంటను లక్నో బౌలర్లు ఏ మేరకు అడ్డుకుంటారో చూడాలి. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్ తిరిగి జట్టులో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మయాంక్ యాదవ్ వస్తే యశ్ ఠాకూర్, మోసిన్ ఖాన్ తో కలిసి అన్ క్యాప్డ్ ఇండియన్ యంగ్ బౌలర్లు బౌలింగ్ వేయాల్సి ఉంటుంది.
కైల్ యేయర్స్ ను తీసుకునే అవకాశం కూడా ఉంది. కైల్ మేయర్స్ కు తుది జట్టులో చోటు ఇచ్చేందుకు లక్నో యాజమాన్యం ట్రై చేస్తుంది.
ఇటు రాజస్థాన్ లో టాప్ ఫోర్ బ్యాట్స్ మెన్ లు భారీ ఫామ్ లో ఉన్నారు. బట్లర్, యశస్వి జైశ్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్ లు చెలరేగి ఆడుతున్నారు. బౌలింగ్ లో బౌల్ట్, సందీప్ శర్మ, అవేశ్ ఖాన్ అదరగొడుతున్నారు. ఇప్పటికే 8 మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ 7 గెలిచి పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ లో ఉంది. ఇంకా ఆరు మ్యాచులు ఆడాల్సి ఉండగా.. రెండింట్లో విజయం సాధిస్తే చాలు ప్లే ఆప్ చేరడం ఖాయమైపోతుంది. లక్నో కూడా గత మ్యాచ్ లో చెన్నైను చెపాక్ స్టేడియంలో మట్టి కరిపించి పూర్తి ఫామ్ లోకి వచ్చింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్స్ లో అయిదు విజయాలతో అయిదో స్థానంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్ లో గనక గెలిస్తే లక్నో కూడా ప్లే ఆప్ రేసులో ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.