JAISW News Telugu

KCR : బీజేపీతో దోస్తీకి మాజీ సీఎం ప్రయత్నాలు.. ఫలించేనా..?

KCR

KCR

KCR : గత ఎన్నికల్లో (2019) టీడీపీ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీలోని ప్రముఖులు, బాబు సన్నిహితులు సుజనా చౌదరి, సీఎం రమేష్ బీజేపీలోకి వెళ్లారు. అప్పటి నుంచే టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాలు మరింత మెరుగుపడి 2024 ఎన్నికల్లో పొత్తుకు వరకు తీసుకువచ్చాయి. ఇప్పుడు వారు ఏపీ అభివృద్ధికి బాబుతో కలిసి పని చేస్తున్నారు.

కేసీఆర్‌ కూడా తన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్పించేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. బీజేపీకి రాజ్యసభలో బలం లేదు. కనుక నలుగురు బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, పార్ధసారధి రెడ్డి, సురేశ్ రెడ్డిని బీజేపీ కోసం త్యాగం చేసేందుకు కేసీఆర్‌ సిద్ధమైనట్లు పార్టీ నుంచి టాక్ వినిపిస్తోంది.

అందుకు ప్రతిగా తెలంగాణలో రేవంత్‌ ప్రభుత్వాన్ని కూలదోసి తాను సీఎం పదవి చేపట్టేందుకు కేంద్రం సాయం చేయాలని షరతు విధించిన్నట్లు తెలుస్తోంది. ఇదే పనిమీద కేటీఆర్‌, హరీష్ రావు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నలుగురు బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో చేరితే తెర వెనుక కేసీఆర్‌ ప్రయత్నాలు ఫలించిన్నట్లే చెప్పుకోవచ్చు. అందుకే కావచ్చు.. కేసీఆర్ మాట్లాడినప్పుడల్లా రెండు నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు అంటూ చెపుతున్నారు..?

బీజేపీకి రాజ్యసభలో బలం అవసరమే కాని తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్‌కు కేంద్రం సహకరిస్తుందా..? తెలంగాణలో కేసీఆర్‌ను గద్దెనెక్కనిస్తే బీజేపీ పరిస్థితి ఏంటి..? కుదిరితే మోడీనే గద్దె దించాలనుకున్న కేసీఆర్‌తో దోస్తీ అవసరమా..? బీజేపీ సీనియర్ నేత సంతోష్ కుమార్‌ను అరెస్ట్ చేసి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయాలనుకున్న కేసీఆర్‌కు బీజేపీ ఎందుకు తోడ్పడాలి..? కేసీఆర్‌కు సహకరించేందుకు సిద్ధపడినా చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటారా..? లెక్కలు కట్టుకోకుండా కేసీఆర్‌తో బీజేపీ అధిష్టానం చేతులు కలుపుతుందనుకోలేము.

Exit mobile version