MP Asaduddin Owaisi : తెలంగాణలో హైడ్రా కూల్చివేతల అంశం హాట్ టాపిక్ గా మారింది. డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ కట్టడాల కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రభెత్వ భవనాలను ఎఫ్ టీఎల్ లో కట్టారు, వాటిని కూల్చేస్తారా అని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్డు కూడా ఎఫ్ టీఎల్ పరిధిలో ఉంది తొలగిస్తారా అని ప్రశ్నించారు.
జీహెచ్ఎంసీ అఫీస్ సెక్రటేరియేట్, ప్రముఖుల ఘాట్ లు ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్నాయి. వాటిని కూడా కూల్చేస్తారా అంటూ మండిపడ్డారు. ఎవరు అడ్డొచ్చినా మూసీ సుందరీకరణ ఆగదంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమయింది. నిజామాబాద్ నగరంలోని ఖిల్లారోడ్ లో నిర్వహించిన సభలో అసదుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబ్జాల తొలగింపులో పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కాంగ్రెస్ హామీల్లో పేదల సంక్షేమం ఉందని మర్చిపోవద్దని చెప్పారు.