CM Jagan : ఆ నిర్ణయం జగన్ ను ముంచుతుందా..తేలుస్తుందా?

CM Jagan

CM Jagan

CM Jagan : ఏపీలో మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రోజు రోజుకూ ఎన్నికల పోరు ఉత్కంఠగా మారుతోంది. ఇదిలా ఉంటే  రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈరోజు, రేపు టిడిపి అధినేత చంద్రబాబు, సీఎం జగన్ కీలక నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార చేపట్టనున్నారు. పోలింగ్ ముందు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. సీఎం జగన్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం రాబోయే ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. జగన్ వ్యూహాల పై ప్రత్యర్ధి పార్టీలు అప్రమత్తమవుతున్నాయి.
 
 ఈనెల 13న జరిగే ఎన్నికలకు ఓటర్ల ను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు ఆఖరి అస్త్రాలను ప్రయోగించే పనిలో ఉన్నాయి.  ఈరోజు, రేపు పోలింగ్ చివరి సమయం కావటంతో సీఎం జగన్.. టీడీపీ భారీగా ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల పై పూర్తి ఫోకస్ చేసారు. ఈరోజు చంద్రబాబు కుమారుడు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత మంత్రి రోజా పోటీ చేస్తున్న నగరి, సాయంత్రం కడప ప్రచార సభల్లో జగన్ పాల్గొననున్నారు. మంత్రి రోజా నగరిలో వెనుకబడి ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో అక్కడ రోజాని గెలిపించే బాధ్యతను జగన్ తీసుకున్నారు. మంగళగిరిలో బీసీ కార్డు ద్వారా లోకేష్ కు చెక్ పెట్టాలని జగన్ పార్టీ భావిస్తోంది.

ఈరోజు మంగళగిరిలో జగన్ ప్రచారంలో భాగంగా ఆయన చేసే వ్యాఖ్యల పైనే అందరి దృష్టి నెలకొంది. ఆ తర్వాత నగరిలో జగన్ సొంత పార్టీలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఎటువంటి దిశ నిర్దేశం చేస్తారు.. రోజా గెలుపుకు ఎలాంటి ప్రణాళిక రచిస్తారనేది మరో ఆసక్తికర అంశం. ఇక ఇటు కడప ఎన్నికల ప్రచార సభలో జగన్ ముస్లిం రిజర్వేషన్ల పైన స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే బీజేపీ నేతలు మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటిస్తున్న తరుణంలో జగన్ తన వైఖరి తేల్చి చెప్పారు. అయితే ఈ విషయం జగన్ కు లబ్ధి చేకూరుస్తుందా..మెజార్టీ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా చూడాలి.. ఈరోజు కడపలో మరోసారి ఇదే అంశం పైన క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా సంక్షేమ పథకాల నగదు బదిలీకి కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇదే సమయంలో కోర్టు కొన్ని కండిషన్లు పెట్టింది. ఎన్నికల టైంలో లబ్ధిదారులకు ఈ పథకాలు అందటం ద్వారా ఎలాంటి ప్రభావం ఉంటుందనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

TAGS