Team India : టీమిండియా ఇవాళే ముగిస్తుందా?  బంగ్లాకు మరో చాన్స్ ఇస్తుందా? 

Team India

Team India

Team India : గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్  తొలి మ్యాచ్‌లో టీమిండియా సులువుగా గెలిచి విజయం సాధించింది. 1-0తో ముందంజలో ఉంది. ప్రస్తుతం భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ బుధవారం జరగనుంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. టీమ్‌ ఇండియాకు ముందుగా బ్యాటింగ్‌ చేసే అవకాశం వస్తే.. ఆ తర్వాత భారీ స్కోరును చూడొచ్చని క్రికెట్ విశ్లేషకుల భావన. ఈ స్టేడియంలో అభిషేక్ శర్మ  పరుగుల వరద పారిస్తాడని పేర్కొంటున్నారు. ఇక ఐపీఎల్ 2024లో తొలి ఇన్నింగ్స్‌లో చాలా పరుగులు చేసిన  టీమిండియా భారీ స్కోరు చేస్తుందని భావిస్తున్నారు.
ఐపీఎల్ 2024లో ఈ వేదికపై చాలా పరుగులు వచ్చాయి. ఢిల్లీ పిచ్ లో  బౌలర్లకు కాలం చెల్లింది. ఈ ట్రాక్ రికార్డును పరిగణనలోకి తీసుకుంటే, భారీ స్కోర్ సాధించే అవకాశాలు ఉన్నాయని అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్ 2024లో ఈ వేదికపై మొత్తం 5 మ్యాచ్‌లు జరిగాయి. ఈ 5 మ్యాచ్‌లలోనూ తొలి ఇన్నింగ్స్‌లో 200కి పైగా పరుగులు నమోదయ్యాయి. ఈ లెక్కన టీమ్ ఇండియాకు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే, ఇక్కడ భారత జట్టు భారీ స్కోరు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత బ్యాట్స్‌మెన్ ఫామ్‌లో ఉన్న విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటే భారీ స్కోర్ తో టీమిండియా విజయం సాధిస్తుందని చెప్పవచ్చు.
ఢిల్లీలో అభిషేక్  హవా.
భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ అక్టోబర్ 9న జరగనుంది. ఢిల్లీలో జరిగే మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీం ఇండియా భావిస్తోంది. అభిషేక్ శర్మ టీమిండియా ఆకాంక్షకు మద్దతుగా నిలుస్తాడని భావిస్తున్నారు. అభిషేక్ శర్మ ఢిల్లీ పిచ్‌పై వేగంగా పరుగులు చేయగలడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇప్పటివరకు 5 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను సగటు 59,  217 స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేశాడు. రెండో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ నుంచ భారీ ఇన్నింగ్స్‌ ఆశించవచ్చు.
TAGS