Sharmila : షర్మిల ఏపీలో ప్రభావం చూపుతుందా?
Sharmila : ఆంధ్రప్రదేశ్ లో రెండు నెలల్లో ఎన్నికలు రానుండటంతో రాజకీయ పార్టీల్లో వేడి రగులుకుంది. ఇన్నాళ్లు ముక్కోణపు పోటీ ఉంటుందనుకుంటే ఈ సారి చతుర్ముఖ పోటీ కానుంది. వైసీపీ, బీజేపీ, టీడీపీ+జనసేన, కాంగ్రెస్ కూడా పోటీలో ఉండనుంది. ఈ మేరకు అన్నపై యుద్ధం చేసేందుకు చెల్లెలు షర్మిల కూడా రెడీగానే ఉంది. దీంతో పోరు రసవత్తరంగా మారనుంది.
కాంగ్రెస్ పార్టీ 11చోట్ల బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఈ సభలకు జనం ఎంత మేర వస్తారో చూస్తారు. దాని మీదే కాంగ్రెస్ ప్రతిష్ట ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. ఇదివరకు గతంలో షర్మిల చేసిన పాదయాత్రలకు జనం భారీగానే వచ్చారు. దీంతో ఇప్పుడు జరిపే బహిరంగసభలకు వచ్చే జనం ఎంతో అనేది తేలాల్సి ఉంది.
కాంగ్రెస్ డబ్బులు ఇఛ్చి తీసుకొస్తుందా? లేక స్వచ్ఛంధంగా ప్రజలు వస్తారా? లేదా అనేది తేలుస్తుంది. వారి బలం ఎంతో బలగం ఎంతో లెక్క కడతారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్న బలమెంతో తెలుస్తుంది. ఈనేపథ్యంలో షర్మిల సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? లేక వైసీపీనే పట్టు నిలుపుకుంటుందా అనే దాని మీదే పార్టీల భవితవ్యం తేలుతుంది.
షర్మిల తెలంగాణ వైఎస్సార్ టీపీ ప్రారంభించాక అంత రెస్పాన్స్ రాకపోవడంతో పార్టీని రద్దు చేసుకున్నారు. ఏపీలో అన్నపైనే రాజకీయ పోరాటం చేసేందుకు నిర్ణయించుకుంది. ఇప్పుడు వైసీపీనా? కాంగ్రెస్ పార్టీనా అని రెండింటిలో దేనికి బలముందో తెలుస్తుంది. అప్పుడే వారి రాజకీయ పలుకుబడి ఎలా ఉపయోపడుతుందో తెలుస్తుంది. అన్న చెల్లెలు, అమ్మలను గుర్తించకపోవడంతోనే వారు వేరుకుంపటి పెట్టుకున్నట్లు సమాచారం.