Samantha : సమంత బోల్డ్ సీన్స్ తో రెచ్చిపోనుందా.. ఎవరి పక్కన అలాంటి సీన్లు చేయనుందంటే?
Samantha : సమంత బోల్డ్ సీన్స్ తో మళ్లీ రెచ్చిపోనుంది. మొన్నటి వరకు మయోసైటిస్ వ్యాధితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఆమెకు కొందరు మద్దతు నిలిచారు. దీంతో ఆమె కోలుకుని మళ్లీ సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకుంది. సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో సమంత అంటే తెలియని వారు ఉండరు. నాగ చైతన్య తో విడాకుల అనంతరం ఆమె పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు, దీనికి తోడు మయోసైటిస్ వ్యాధితో బాధపడినట్లు ఆమెనే స్వయంగా ప్రకటించింది.
వ్యాధికి చికిత్స తీసుకున్న అనంతరం ఆమె మళ్లీ సినిమాల బాట పట్టనుంది. తాజాగా వెబ్ సిరీస్ లో నటించేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో బోల్డ్ సీన్స్ తో రెచ్చిపోయిన సమంత సెన్సెషనల్ గా మారింది. అప్పుడు తన విడాకులు కావడంతో ఈ సిరీస్ లో చేసిన బోల్డ్ సీన్సే కారణమని చాలా మంది అనుకున్నారు.
తాజాగా తుంబాడ్ మూవీ దర్శకుడు రావీ అనిల్ బార్వే దర్శకత్వంలో బాలీవుడ్ నుంచి రాబోతున్న వెబ్ సిరీస్ లో సమంత నటించనుంది. ముఖ్యంగా ఇందులో బోల్డ్ గా గ్లామర్ రోల్ పోషించనున్నట్లు సినీ వర్గాల టాక్. కానీ ఎవరితో అనేది స్పష్టంగా తెలియడం లేదు. అయితే కొంతమంది మాత్రం మీర్జాపూర్ వెబ్ సిరీస్ హిరో అలీ ఫజల్ ఈ వెబ్ సిరీస్ లో నటించనున్నట్లు అలీ ఫజల్ తోనే సమంత బోల్డ్ సీన్స్ లో యాక్ట్ చేయనుందని పుకార్లు వినిపిస్తున్నాయి.
సమంత తన విడాకులు, వ్యాధి అనంతరం షూటింగ్ లలో అంతగా పాల్గొనలేదు. కాగా.. సమంతకు వ్యాధి పూర్తిగా నయం కావడంతో ప్రస్తుతం వచ్చే ఏడాది మొత్తం వెబ్ సిరీస్ లు, మూవీస్ లతో బిజీగా గడపాలని భావిస్తోంది. ఆఫర్లు కూడా అలానే భారీగా రావడంతో ఆమె చురుగ్గా ఉన్నట్లు ఇక బోల్డ్ సీన్స్ తో మళ్లీ రెచ్చిపోయేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.