Revanth Reddy : ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఉచ్చు బిగియబోతుందా? సుప్రీం కోర్టు తీర్పు ఏం చెప్పబోతోంది? ఈ విషయమై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ప్రజాప్రతినిధులు లంచాలు తీసుకోవడం, శాసన సభలు, పార్లమెంట్ లో ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకోవడం లాంటి అంశాలపై సుప్రీం కోర్టు నేడు తీర్పు ఇవ్వబోతోంది.
ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకున్నా, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న ఏసీబీ దాడులు చేస్తుంది. అవసరమైతే కేసులు పెడుతుంది, అరెస్ట్ చేస్తుంది. అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. అక్రమ ఆస్తులను రికవరీ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగి అక్రమాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ ప్రజాప్రతినిధులు చేస్తే మన దేశంలో శిక్షించడానికి వీలు లేదని గతంలో కొన్ని సుప్రీం కోర్టు తీర్పులు వెల్లడించాయి.
అయితే ప్రస్తుతం ప్రజాప్రతినిధులు అక్రమాలకు పాల్పడితే శిక్షించే అవకాశం ఉందని, చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ తదితర కేసుల్లో వెల్లడైంది. ప్రజాప్రతినిధులు లంచాలు తీసుకోవడం, అవినీతి చేయడంపై సుప్రీం కోర్టు నేడు తీర్పు ఇవ్వబోతోంది. ఈ కేసులో సుప్రీం తీర్పుపై రేవంత్ రెడ్డి భవిష్యత్ ఆధారపడి ఉంది.
రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండగా 2015లో టీడీపీలో ఉండగా ఈ కేసు నమోదు అయ్యింది. చంద్రబాబు ఆదేశాల మేరకు ఎల్విన్ స్టీఫెన్ సన్ కు రూ.50లక్షల లంచం ఇస్తుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం ఈ కేసులో సుప్రీం తీర్పు ఇవ్వకున్నా.. ప్రజాప్రతినిధుల అవినీతి, లంచాలపై తీర్పుపై రేవంత్ కేసు కూడా ఆధారపడి ఉంది. ప్రజాప్రతినిధులు లంచం ఇచ్చినా, తీసుకున్నా శిక్షార్హులే అంటూ తీర్పు వెలువడితే మాత్రం రేవంత్ కు ఇబ్బందికర పరిస్థితే అని చెప్పవచ్చు.