Prashant Neil : ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ పై ఉన్న ఆ ముద్రను చెరిపేస్తాడా?
ఇక దేవర సినిమా బ్యాక్ డ్రాప్ సౌత్ హీరోలకు కొత్తేమీ కాదు. నార్త్ లో మాత్రం వారికి కాస్త కొత్తగానే అనిపించినా వసూళ్లు అయితే పెద్దగా ఏమీలేవు. నార్త్ లో ఓ సినిమా హిట్టయితే సులువుగా రూ. 500 కోట్లు దాటేస్తుంది. కానీ దేవర విషయంలో అలా జరగలేదు. మొత్తం ప్రాఫిట్ 300 కోట్లు కాగా, ఖర్చు రూ. 250 కోట్లు. దీంతో నిర్మాతకు పెద్దగా మిగిలిందేమీ లేదు.
ఇక ఇటీవల మరో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో జతకట్టాడు ఎన్టీఆర్. వీరిద్దరి కాంబినేషనల్ లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎన్టీఆర్ ఇమేజ్ ను సమూలంగా మార్చుతుందని అభిమానులు, నిర్మాతలు భావిస్తున్నారు. ఎందుకంటే కేజీఎఫ్ లో యష్ ను, సలార్ లో ప్రభాస్ ను చూపించిన విధానమే ఇందుకు కారణం. ఈ ఇద్దరు హీరోలు వారి గత చిత్రాలకన్నా ఇందులో మారింత మాసీ గా కనిపించి అభిమానులు అలరించారు. ఇక ఈ రెండు సినిమాల్లో హీరోల ఎలివేషన్ సీన్లు అసాధారణం. ఇలా హీరోలను ఎలివేట్ చేయొచ్చని ప్రశాంత్ చూపించాడు.
ఇక ఎన్టీఆర్ పై ఉన్న ముద్రను కూడా ప్రశాంత్ నీల్ చెరిపివేస్తాడని అంతా అనుకుంటున్నారు. మాస్ హీరోగా ఎన్టీఆర్ ను మరో సరికొత్త కోణంలో ప్రశాంత్ నీల్ చూపిస్తాడనే ఆశలు యంగ్ టైగర్ అభిమానుల్లో ఉన్నాయి. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలైతే నెలకొన్నాయి. మరి ప్రశాంత్ నీల్ ఈసారి ఏం చేయబోతున్నాడో చూడాల్సిందే.