Prabhas – Rajamouli : రాజమౌళి రికార్డును ప్రభాస్ బ్రేక్ చేస్తాడా?
Prabhas – Rajamouli : భారీ బడ్జెట్, స్టార్ యాక్టర్స్, భారీ బాక్సాఫీస్ సత్తా ఉన్న ‘కల్కి: 2898 ఏడీ’ ఈ ఏడాది బిగ్గెస్ట్ మూవీగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్ మొదట్లో బజ్ క్రియేట్ చేసేందుకు ఇబ్బంది పడినా.. ఇటీవల ప్రైమ్ లో విడుదలైన యానిమేటెడ్ సిరీస్ ‘బుజ్జి అండ్ భైరవ’తో కల్కిపై కొత్త ఆసక్తి రేకెత్తించింది. ప్రభాస్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గతంలో జగన్ ప్రభుత్వం కొన్ని ప్రతి కూల నిర్ణయాల వల్ల సినిమా ప్రపంచం ఒడిదుడుకులను ఎదుర్కొంది. తాజాగా ప్రభుత్వం మారడం, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం తెలుగు చిత్రపరిశ్రమలో కొత్త సినిమాలకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వం టికెట్ల ధరల పెంపు, స్పెషల్ షో అనుమతులతో ఇండస్ట్రీ చాలా ఇబ్బందులను ఎదుర్కొంది.
ఇక కల్కి విషయానికి వస్తే గతంలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో రిలీజ్ కు కొంచెం ఇబ్బంది పడ్డారు నిర్మాత అశ్వినీదత్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం, ఈ చిత్ర నిర్మాత అశ్వనీదత్ కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సన్నిహితుడు కావడంతో పరిస్థితి అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం అనుమతులు, టికెట్ల పెంపు విషయంలో ఉదారంగా వ్యవహరించే అవకాశం ఉందని ఇండస్ట్రీ అనుకుంటోంది.
ఫలితంగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ (2022) నెలకొల్పిన రికార్డులను ‘కల్కి: 2898 ఏడీ’ బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే గ్రాస్ 70 కోట్లు, లైఫ్ టైమ్ కలెక్షన్స్ 230 కోట్లు. పాత ప్రభుత్వం విధించిన టికెట్ ధరలు తక్కువగా ఉండడంతో ప్రభాస్ గత చిత్రం ఈ రికార్డులను బీట్ చేయలేకపోయింది. కానీ కల్కి: క్రీ.శ 2898తో అత్యధిక ప్రింట్లు, పెరిగిన టికెట్ ధరతో రికార్డు నెలకొల్పుతుందని భావిస్తున్నారు. దీంతో రాజమౌళి సినిమా కలెక్షన్లను అధిగమించే సత్తా ప్రభాస్ కు దక్కే అవకాశం ఉంది.