Pawan Kalyan Campaign for Telangana : షెడ్యూల్ లోని ముఖ్యమైన ఘట్టం నామినేషన్ ప్రక్రియ శుక్రవారం (నవంబర్ 10)తో ముగిసింది. ఇక మిగిలింది ప్రచారం మాత్రమే. అయితే ఇప్పటికే చాలా పార్టీల అస్త్ర శస్త్ర, రథాలతో సిద్ధంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పెద్దలు లోకల్ గా ఉండగా.. కాంగ్రెస్ పక్క రాష్ట్రం (కర్ణాటక) నుంచి నాయకులను తెచ్చుకుంటుంది. ఇక మిగిలింది బీజేపీ మాత్రమే ప్రచారం కోసం కూడా అధిష్టానంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అయితే, తెలంగాణలో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేస్తుంది. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రచార షడ్యూల్ ఇప్పటి వరుక ఖరారు కాకపోవడంతో ఇటు బీజేపీ, అటు జనసేన అభ్యర్థుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. తెలంగాణలో జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తుంది. బీజేపీతో కలిసిన పవన్ కళ్యాణ్ ఇప్పటికే తెలంగాణలో నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని, అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో, దేశంలో మోడీ పాలన రావాల్సిన అవసరం ఉందని ప్రకటించారు.
ఆ సమావేశం తర్వాత పవన్ కళ్యాన్ పార్టీ వివిధ సమావేశాలతో బిజీగా ఉన్నప్పటికీ తన పార్టీ పోటీ చేస్తున్న 8 నియోజకవర్గాల్లో ఇంకా ప్రచారం ప్రారంభించలేదు. రాష్ట్రంలో పవన్ పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని వార్తలు వస్తున్నాయి. ప్రచారానికి ఇంకా 16 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో ప్రభావం చూపేందుకు తన ప్రణాళికలను వేగవంతం చేయాలని, తెలంగాణలో జరిగే ఈ అతిపెద్ద ఎన్నికల్లో జనసేన తన ఉనికిని చాటుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేస్తున్న రాజకీయ పార్టీకి ఆట కొత్త స్థాయిలో ఉంటుంది.