Pakistan Help Maldives : మాల్దీవులకు పాక్ సాయం చేస్తుందట?
Pakistan help Maldives : మూతులు నాకే వాడికి చేతులు నాకే వాడు తోడైనట్లు మాల్దీవులకు సాయం చేస్తామని పాకిస్తాన్ ప్రకటించడం గమనార్హం. ఆ దేశమే పీకల్లోతు కష్టాల్లో ఉండగా మాల్దీవులను ఆదుకుంటామని చేసిన ప్రకటన విస్మయం కలిగిస్తోంది. అడుక్కుతినే దేశం ఆపదలో సాయం చేస్తామని చెప్పడం అందరిని కలవర పరుస్తోంది. పాకిస్తాన్ లో చోటు చేసుకున్న ఆర్థిక సంక్షోభం ప్రపంచానికి తెలిసిందే. కానీ ఆదేశమే మాల్దీవులకు సాయం చేస్తామని పెద్దన్న పాత్ర పోషిస్తామని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.
మాల్దీవుల కోసం అవసరమైన సాయం అందజేస్తామని పాక్ ప్రధాని హామీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రెండు దేశాల మధ్య 1966 నుంచి దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రస్తుత మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు చైనాకు సన్నిహితంగా ఉంటాడని తెలిసిందే. ఇస్లామాబాద్, బీజింగ్ మధ్య కూడా మంచి బలమైన సంబంధాలు ఉండటంతో ఇస్లామాబాద్ కోరిక మేరకు మాల్దీవులకు సాయం అందించేందుకు డ్రాగన్ ముందుకు వస్తుందని అంచనా వేస్తున్నారు.
పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాక్ ఇటీవల 2 బిలియన్ డాలర్ల రుణం ఇవ్వాలని డ్రాగన్ ను వేడుకుంది. పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ప్రీమియర్ లి క్వియాంగ్ కు లేఖ రాశారు. పాకిస్తాన్ కు అందించే ఐఎంఎఫ్ 2 శాతం కోత విధించిన విషయం తెలిసిందే. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ను విక్రయించి ఆర్థిక కష్టాలు తీర్చుకోవాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తోంది.
భారత్ తో నెలకొన్న వివాదాల కారణంగా ఆ దేశానికి మనం అందజేసే సాయంలో కోత విధించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.600 కోట్లు మంజూరు చేసింది. 2023-24లో ఇది రూ.770 కోట్లుగా ఉంది. తొలుత దీన్ని రూ. 400 కోట్లకే పరిమితం చేసింది. తరువాత సమీక్షించి రూ.183 కోట్లు అందించింది. కొన్నేళ్లుగా ఆ దేశానికి సాయం అందిస్తూ వస్తోంది. ఇటీవల కాలంలో ఆ దేశంతో పొడచూపిన వివాదాలతో దానికి సాయం నిలిపేసేందుకు నిర్ణయించుకుంది.
దీంతో మాల్దీవులు పాక్ సాయం కోరింది. పాక్ ప్రస్తుతం ఆర్థిక నష్టాల్లో ఉన్నా మాల్దీవులను ఆదుకుంటామని ప్రకటించడంతో నవ్వులపాలవుతోంది. దానికే సరైన ఆధారం లేదు. కానీ అది ఇతరులకు సాయం చేస్తుందని హాస్యాస్పదంగా చూస్తున్నాయి. డ్రాగన్ పై ఉన్నఆశతోనే ఇలా మాట్లాడుతుందని పేర్కొంటున్నారు. ఎలా సాయం చేస్తుందో చూడాలని సవాలు విసురుతున్నారు.