Orissa Metro : ఒరిస్సాకు మెట్రో భాగ్యం దక్కనుందా?

Orissa Metro

Orissa Metro soon

Orissa Metro : ప్రస్తుతం దేశంలో మెట్రో రైళ్ల హవా కొనసాగుతోంది. హైదరాబాద్ లో మెట్రో పరుగులు పెడుతోంది. దీంతో మెట్రో రైలు మరిన్ని నగరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఒరిస్సా, భువనేశ్వర్ లాంటి నగరాల్లో మెట్రో రైళ్ల ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక ఇక్కడ కూడా మెట్రో పరుగులు పెట్టించేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తోంది.

తొలిదశలో భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి కటక్ త్రిశూలియా వరకు మెట్రో రైల్వే ప్రాజెక్టు నిర్మించేందుకు ప్లాన్లు సిద్ధం చేశారు. ఇక పనులు ప్రారంభించడమే తరువాయి. దీంతో ఒరిస్సా రూపురేఖలే మారనున్నాయి. ప్రజలకు దూరభారం తగ్గనుంది. తక్కువ ధరతోనే ఎక్కువ దూరం ప్రయాణించే వెసులుబాటు కలుగుతుంది.

తొలిదశ పనులకు రూ. 5929 కోట్లు కేటాయించనున్నారు. జనవరి 1న సీఎం పనులు ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు కసరత్తులు జరుగుతున్నాయి. మెట్రో రాకతో ప్రజలకు మరింత సౌకర్యంగా మారనుంది. మెట్రో రైలు కోసం ప్రజలు కూడా ఉత్కంఠగా ఉన్నారు. తమ ప్రాంతానికి మెట్రో కావాలని చాలా రోజులుగా కోరుతుండటంతో ఈ మేరకు ప్రతిపాదనలు వెళ్లాయి.

ఒరిస్సా వెనుకబడిన ప్రాంతం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారే ఎక్కువ మంది ఉంటారు. దీంతో మెట్రో నిర్మాణం జరిగితే వారికి చాలా ప్రయోజనాలు దక్కుతాయి. నవీన్ పట్నాయక్ మెట్రో నిర్మాణానికి మొగ్గు చూపడం ఆహ్వానించదగినదే. ఈనేపథ్యంలో మెట్రో నిర్మాణం ఆవశ్యకమే. సర్కారు తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వస్తున్నాయి. ఆ కల త్వరగా నెరవేరాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రస్తుతం దేశంలో మెట్రో రైళ్ల హవా కొనసాగుతోంది. హైదరాబాద్ లో మెట్రో పరుగులు పెడుతోంది. దీంతో మెట్రో రైలు మరిన్ని నగరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఒరిస్సా, భువనేశ్వర్ లాంటి నగరాల్లో మెట్రో రైళ్ల ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక ఇక్కడ కూడా మెట్రో పరుగులు పెట్టించేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తోంది.

TAGS