NTR Devara : ‘దేవర’ ఎన్టీఆర్‌కు అత్యధిక యూఎస్ బ్రేక్ ఈవెన్ ఇవ్వనుందా?
NTR Devara : ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో తన తర్వాతి ప్రాజెక్టును చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు ఎన్టీఆర్. ఆచార్యకు సంబంధించిన ఆర్థిక విషయాలను కొరటాల పరిష్కరించి షూటింగ్ ప్రారంభిస్తారని ఓపికగా ఎదురుచూశాడు. ఈ చర్యను అభిమానులు ప్రైమ్ టైమ్ వృథాగా భావించారు.
కొరటాల తాజాగా ఓ గ్లింప్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచి సినిమా ఎంత గ్రాండ్ గా ఉంటుందో తెలిపాడు. రాజమౌళి మల్టీస్టారర్ మినహాయిస్తే ఎన్టీఆర్ అత్యధిక బడ్జెట్ చిత్రంగా ‘దేవర’ నిలవనుందని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది. నిర్మాతలు ఊహించని విధంగా అధిక ధరలను కోట్ చేశారు. చివరికి తమిళ సినిమా పంపిణీకి ప్రసిద్ధి చెందిన ‘హంసిని ఎంటర్టైన్మెంట్’ ఓవర్సీస్ హక్కులను రూ. 27 కోట్లకు దక్కించుకుంది. గతంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ను కూడా ఈ మార్కెట్ లో డిస్ట్రిబ్యూట్ చేసింది హంసిని.
యూఎస్ఏ బ్రేక్ ఈవెన్ పాయింట్ 5 నుంచి 5.5 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని, ఈ మార్కెట్లో ఎన్టీఆర్ కు రికార్డ్ ధరను సెట్ చేస్తుందని అంచనాలు వస్తున్నాయి. దేవర’ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడాలన్న బలమైన కోరికను క్రియేట్ చేయాలి. ఇకపై విడుదలయ్యే ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ సినిమాపై హైప్ పెంచేలా ఉండాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆ కోణంలోనే చూస్తున్నారు. అంకెలు ఇప్పుడు పెద్దవిగా అనిపించినా, సినిమా స్కేల్ ఇచ్చి థియేటర్లలో చూడదగ్గదంటే ఇక పెద్ద విషయమేమీ కాదు అనేది ప్రస్తుత ట్రెండ్. ‘హను-మాన్’ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.