Sukumar – Nag Ashwin : పాన్ ఇండియా ఆశలు సుకుమార్ కంటే ముందే నాగ్ అశ్విన్ దక్కించుకుంటారా?

Sukumar - Nag Ashwin

Sukumar – Nag Ashwin

Sukumar – Nag Ashwin : ఒకటి, రెండు సినిమాలు చేసిన బగా క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఆయన చేసిన సినిమా విలక్షణంగా ఉండడమే దీనికి కారణం. మహానటితో సావిత్రీ బయోపిక్ ను చేసి జాతీయ ఉత్తమ అవార్డులను కూడా రాబట్టగలిగాడు. దీంతో పాటు ఒక సినిమాను ప్రొడ్యూస్ చేసి అందులో కూడా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’తో రాబోతున్నాడు. ఈ మూవీ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దక్షిణాది దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాతో ఉత్తరాదిలో పాగా వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనతో సుకుమార్ కు గట్టి ఎదురు దెబ్బ తగులుతుందా? అంటే అవుననే బాలీవుడ్ సర్కిల్ నుంచి టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నార్త్ ను కూడా మెస్మరైజ్ చేసిన రాజమౌళి, సందీప్ వంగా జెండా పాతారు. వారి దారిలోనే సుకుమార్ కూడా వెళ్లాలనుకుంటున్నాడు. దీనికి ‘పుష్ప’ మంచి బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇప్పుడు పుష్ప2తో మరింత క్రేజ్ సంపాదించాలని అనుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది అదేంటేంటే?

హిందీలో ‘కల్కి 2898 ఏడీ’తో నాగ్ అశ్విన్ సక్సెస్ సాధిస్తే అది పుష్ప దర్శకుడు సుకుమార్ పై ప్రభావం చూపుతుంది. కారణం సింపుల్ పుష్ప 2 ఎంత సక్సెస్ అయినా మసాలా మాస్ ఎంటర్ టైనర్ గా కనిపిస్తుంది. అంతే కాకుండా పుష్ప 2 కు నార్త్ లో సుకుమార్ కంటే అల్లు అర్జున్ బ్రాండ్ తోనే ఎక్కువ అనుబంధం ఉంది.

అయితే ‘కల్కి 2898 ఏడీ’ని నాగి సక్సెస్ ఫుల్ గా డెలివరీ చేస్తే తెలుగు నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు. అంతేకాదు, కల్కి సీక్వెల్ ఉండడం నాగికి ఉత్తరాది మార్కెట్ లోకి మరింత చొచ్చుకుపోవడానికి మరో ముఖ్యమైన అడ్వాంటేజ్.

ఒక సినిమా లేదంటే శుక్రవారం (సినిమా రిలీజ్ డే) అన్నింటినీ మార్చగలదు. భారతీయ ప్రేక్షకులకు తన వైపునకు తిప్పుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న స్కేల్, సబ్జెక్ట్ మరియు అనుభవం దృష్ట్యా నాగికి ఇది వర్తిస్తుంది. మరి రాజమౌళి, సందీప్ వంగా తర్వాత తెలుగు నుంచి ఏ దర్శకుడు ఎలైట్ పాన్ ఇండియా ప్రీమియం క్లబ్ లో చేరతాడో చూడాలి.

TAGS