JAISW News Telugu

MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందా? రాదా?

MLC Kavitha

MLC Kavitha

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత కస్టడీ రేపటితో ముగియనుంది. దీంతో ఆమెకు కస్టడీ ఇంకా పొడిగిస్తారా? లేక బెయిల్ మంజూరు చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కవిత బెయిల్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీటిపై సోమవారం విచారణ కొనసాగనుంది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కవితకు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆమెను మరోసారి రిమాండ్ ను పొడిగిస్తారా? లేక బెయిల్ మంజూరు చేస్తారా? అని బీఆర్ఎస్ వర్గాలు ఉత్కంఠగా చూస్తున్నాయి. అటు సీబీఐ, ఇటు ఈడీ కేసులు నమోదు చేయడంతో రెండు శాఖలు బెయిల్ మంజూరు చేస్తేనే కవిత బయటకు వస్తారు. లేదంటే ఏ ఒక్క శాఖ నిరాకరించినా ఆమె కస్టడీలోనే ఉండాల్సి ఉంటుంది.

రెండు శాఖలు బెయిల్ ఇవ్వొద్దనే నిర్ణయానికి వస్తాయని అంటున్నారు. కవిత బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అందుకే ఆమెను కస్టడీలోనే ఉంచాలని చూస్తున్నారని సమాచారం. సౌత్ గ్రూపునకు చెందిన శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరింపులకు గురి చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

కవితపై ఉన్న కేసుల వల్ల ఆమె బయటకు వచ్చే చాన్స్ లేదంటున్నారు. కేసులు బలంగా ఉండటంతో ఆమెకు బెయిల్ రాదని నమ్ముతున్నారు. కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై కేసులు బలంగా ఉన్నాయి. అందుకే వారిని జైల్లోనే ఉంచుతున్నారు. వారిపై విచారణ పూర్తి చేసి నేరాలు రుజువైతే కానీ వారి భవిష్యత్ ఏమిటో తెలియదు.

ఈనేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత కస్టడీ రేపటితో ముగియడంతో ఆమెను ఇంకా ఎన్ని రోజులు కస్టడీలో ఉంచాలని తీర్పు వస్తుందో తెలియడం లేదు. మొత్తానికి ఇవాళ వెలువరించే తీర్పుపైనే ఆమె భవితవ్యం ఆధారపడి ఉంది. కోర్టు ఏం తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సిందే.

Exit mobile version