YS Sharmila : విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై త్వరలో సీఎంను కలుస్తామని వైఎస్ షర్మిల తెలిపారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆమె హాజరయ్యారు. అనతరం మీడియాతో ఆమె మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై త్వరలో అఖిలపక్షంతో సీఎంను కలుస్తామన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ని విమర్శించే నైతికత డిప్యూటీ సీఎం పవన్ కు లేదని విమర్శించారు. తిరుమల శ్రీవారి లడ్డూ అంశంపై స్పెషల్ సిట్ ను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని షర్మిల పేర్కొన్నారు.