JAISW News Telugu

KCR : కేసీఆర్ సారూ మౌనదీక్ష వీడరా?

KCR

KCR

KCR : తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 2023 తెలంగాణ అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పది ఏళ్ల పాటు ఉన్న అధికారాన్ని , ముఖ్యమంత్రి పదవి కోల్పోవడంతో కేసీఆర్ రాజకీయాలకు దూరంగా మౌన దీక్ష చేస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన కూతురు కవిత అరెస్టై  ఇప్పటికి దాదాపు మూడు నెలలు కావొస్తున్నా  కేసీఆర్ ఎప్పుడూ తీవ్ర స్థాయిలో దాని పై స్పందించలేదు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేస్తా, పొరుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలను మారుస్తాను అంటూ పగల్భాలు పలికారు ఆయన.  తెలంగాణలో బీఆర్ఎస్ తప్ప మరే పార్టీనైనా తొక్కేస్తా అంటూ భీరాలు పోయిన కేసీఆర్ తన కూతురు  కవితకు కనీసం బెయిల్ కూడా తెచ్చుకోలేకపోతున్నారు. గత ఎన్నికలలో తన గెలుపుతో పాటుగా ఏపీలో తన మిత్రుడు జగన్  గెలుపునకు కూడా సాయం చేసిన కేసీఆర్ ప్రస్తుతం వేరే వాళ్ల సాయం తీసుకోవాల్సిన పరిస్థితికి దిగజారి పోయారనే చెప్పుకోవాలి.

మార్పు మంచిదే అన్నట్లుగా పార్టీ పేరు మార్చి ఒకరు, పార్టీలో నేతల స్థానాలు మార్చి మరోసారి అధికారాన్ని అందుకోవాలి కలలు కన్నారు. అయితే వారి గెలుపు లాంఛనమే అన్న నేతల కలలకు ఓటర్లు గండి కొట్టారు. ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నింటినీ చేస్తుంది. ఒక్కొక్కరుగా కేసీఆర్ కారు మీద నమ్మకం లేక హస్తం గూటికో, బీజేపీ గూటికో వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోవడంతో బిఆర్ఎస్ పార్టీలో మౌనం రాజ్యమేలుతుంది. ఓటమి పై కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పార్టీ క్యాడర్లో ఆత్మ స్తైర్యాన్ని నింపలేదు.  ఓటమి మీద సమీక్షలు జరపలేదు. ఎవరిని నిందించాలో, ఎవరిని బుజ్జ గించాలో, ఎవరి దూషించాలో అర్థంకాకే కేసీఆర్ మౌన దీక్ష చేస్తున్నారా.?   ఇదే మౌనంలో మరికొంత కాలం కేసీఆర్ మరికొంత కాలం గడిపితే బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో కలిసిపోవడం ఖాయం.

Exit mobile version