PK 2.O : జగన్ కు పీకే 2.O దొరుకుతాడా? పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కోసం తీవ్రంగా అన్వేషిస్తున్న వైసీపీ అధినేత..

PK 2.O

PK 2.O, YS_Jagan

PK 2.O : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమర్థుడైన రాజకీయ వ్యూహకర్త కోసం అన్వేషణ చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ నుంచి నాయకులు, కేడర్ రోజు రోజుకు చేరిపోతుంది. దీతో సరైన వ్యూహ కర్త దొరకే సమయానికి పార్టీలో ఎవరైనా ఉంటారా? అన్న అనుమానం కలుగుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవి చూసిన నేపథ్యంలో పార్టీకి కొత్త జీవం పోసేందుకు ప్రొఫెషనల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అవసరాన్ని జగన్ గుర్తించారు.

2019లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్థాపించిన ఐ-ప్యాక్ జగన్ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి, పాలన కొనసాగించేందుకు దోహదపడింది. వైసీపీకి బలమైన పునాది వేయడంలో పీకే ప్రముఖ పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించి వచ్చే ఏడాది బిహార్ ఎన్నికల్లో పోటీ చేయాలని పీకే భావిస్తున్నారు.  ఈలోగా పీకే, జగన్ మధ్య విభేదాలు తలెత్తడంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. 2019లో 151 సీట్లు సాధించిన వైసీపీ 2024 ఎన్నికల్లో ఇంత పరాభవానికి కారణం తన వెనుక పీకే లేకపోవడమేనని జగన్ గ్రహించారు.

అప్పటి నుంచి జగన్ కొత్త వ్యూహకర్త కోసం అన్వేషణ సాగిస్తున్నాడు. కాంగ్రెస్ కు పొలిటికల్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్న సునీల్ ను సంప్రదించే ప్రయత్నం కూడా చేశారు. సునీల్ ఈ మధ్య సక్సెస్ బాటలో ఉన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సీట్లను తగ్గించడంలో ఆయన పాత్ర లేదని చెప్పలేం. అయితే మరికొద్ది నెలల్లో దేశంలోని రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న దృష్ట్యా కాంగ్రెస్ విడిచిపెట్టడం లేదు.  కాంగ్రెస్ కూడా సునీల్ ను పార్టీ వీడనివ్వకపోవడంతో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. పార్టీని ముందుకు నడిపేందుకు, సంక్షోభం నుంచి గట్టెక్కడానికి జగన్ తగిన నేత దొరుకుతారో లేదో చూడాలి.

TAGS