Goat : లియో రికార్డులను ‘గోట్’ బద్ధలు కొడుతుందా?
Goat : దళపతి విజయ్ నటించిన లియో ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లియో రిలీజ్ తో తమిళ ఇండస్ట్రీ ఒక్కసారిగా కుదుపునకు గురైంది. భారీ వసూళ్లు.. మరింత కిక్కెంచించే కథ, కథనంతో ఈ సినిమా కోలీవుడ్ కు బూస్ట్ గా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది లియో తమిళ సినిమాకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన తరుణంలో 2024లో తొలి మేజర్ కోలీవుడ్ ఓపెనింగ్ గా గోట్ రాబోతోంది.
విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి రాకముందే ఆయన చేయబోయే చివరి రెండు చిత్రాల్లో ఇది కూడా ఒకటి కావడం ఆసక్తిని, హైప్ ను పెంచింది. ప్రస్తుతం ఇండియాలో 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో బిగ్గెస్ట్ కోలీవుడ్ ఓపెనింగ్ గా పేరు తెచ్చుకున్న లియోను అధిగమించి ఈ చిత్రం రికార్డ్ బ్రేక్ ఓపెనింగ్ సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
అయితే, దళపతి విజయ్ కు కంచుకోటగా ఉన్న తమిళనాడులో స్పెషల్ షో కు అడ్డంకి కలుగుతుంది. ఇతర ప్రాంతాలు, ఓవర్సీస్ లో ఉదయం 4 గంటలకే ఓటీటీ స్పెషల్ మార్నింగ్ షోలు ప్రారంభం కానుండగా.. తమిళనాడులో మాత్రం ఉదయం 7 లేదంటే 8 గంటల నుంచి రెగ్యులర్ షోలు మాత్రమే ఉంటున్నాయి. స్పెషల్ షోలు ఉంటే టికెట్ ధరలు పెరుగుతాయి. ఇది కలెక్షన్ కు కలిసి వస్తుంది. కానీ సాధారణ షోలను మాత్రమే వేస్తుండడంతో వసూళ్ల పరంగా కొంత దెబ్బ వస్తుందని ట్రేడ్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. విజయ్ సొంత రాష్ట్రమైన తమిళనాడులో స్పెషల్ షోలు లేకపోవడం ఆయనకు కాలసి రాని అంశమే అవుతుంది.
అదనంగా, గోట్ చుట్టూ ఉన్న హైప్ లియోతో సమానంగా కనిపించడం లేదు. లోకేష్ కనగరాజ్ బ్రాండ్ వాల్యూ, అనిరుధ్ సంగీతంతో లియోకు బజ్ ను క్రియేట్ చేశాయి. కానీ, లియో మ్యూజిక్ మాత్రం ఆ స్థాయిలో ఉత్సాహం కలిగించలేదు. ఇదే కాకుండా, ప్రస్తుతం గోట్ కన్నా లియోకే తెలంగాణ, ఆంధ్ర, కేరళ వంటి రాష్ట్రాల్లో హైప్ ఉంది. ఈ పరిమితులు ఉన్నప్పటికీ సినిమా ఎంత బాగా ఆడుతుందనే దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.