JAISW News Telugu

Game Changer : దర్శకుడు శంకర్ కు ‘గేమ్ ఛేంజర్’ అతిపెద్ద హోప్ కానుందా?

Game Changer

Game Changer

Game Changer : దేశంలోని అత్యంత దూరదృష్టి కలిగిన దర్శకులలో తమిళ దర్శకుడు శంకర్  ముందు వరుసలో ఉంటారు. టాలీవుడ్ జక్కన్నగా గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి పూర్తి స్థాయిలో ఇండస్ట్రీలో నిలదొక్కుకోకముందు నుంచే జెంటిల్ మెన్, ఇండియన్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో వంటి భారీ చిత్రాలతో శంకర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలాడు.

కానీ శంకర్ కెరీర్ పరంగా ఇటీవల ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాడని చెప్పవచ్చు. ఆయన లాస్ట్ మూవీ భారతీయుడు2 భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆయన ప్రతిష్టను ఈ మూవీ చాలా వరకు దెబ్బతీసింది. దీంతో ఇక శంకర్ లో స్టఫ్ అయిపోయిందని కొందరు అనుకుంటుంటే, ఔట్ డేటెడ్ అయ్యాడని మరికొందరు, ఆయన శకం ముగిసిందని ఇంకొందరు అనుకుంటున్నారు.

ఇండియన్2 తర్వాత శంకర్ రిలీజ్ చేయబోతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. గ్లోబల్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే ఈ మూవీ విషయంలో రామ్ చరణ్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. శంకర్ హ్యాండ్ పవర్ తగ్గిందని రామ్ చరణ్ ఇటీవల మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడని, ఈ సినిమా గనుక డిజాస్టర్ ను ఎదుర్కొంటే తాము చాలా ఫీలవుతామని అంటున్నారు.

రోబో తర్వాత శంకర్ చేసిన సినిమాలన్నీ సీక్వెల్స్ లేదా రీమేక్ లే కావడంతో అన్నీ ఫ్లాప్ అయ్యాయి. వాటి గురించి ఒక సారి పరిశీలిద్దాం.

* నన్బన్ (2012) ‘3 ఇడియట్స్’కు రిమేక్ గా తెరకెక్కించాడు. అది ఒరిజినల్ కు సరిపోలలేదు.
* ఐ (2015) ది హంచ్ బ్యాక్ ఆఫ్ నోట్రే డామ్ అండ్ ‘బ్యూటీ అండ్ ది బీస్ట్’ ఆధారంగా రూపొందించబడింది. ఇది యావరేజ్ బిజినెస్ మాత్రమే చేయగలిగింది.
* రోబో 2.0 (2018) రోబోకు సీక్వెల్ గా ఈ మూవీ వచ్చింది. ఇది భారీ స్థాయిలో విజయం సాధించింది. కానీ కలెక్షన్ల పరంగా కొంత నిరాశను మిగిల్చింది.
* ‘భారతీయుడు 2’ కూడా భారీ డిజాస్టర్ గానే మిగిలింది.

శంకర్ ఎప్పుడూ ఒరిజినల్ సినిమా ట్రై చేసినా సక్సెస్ అవుతూనే ఉన్నాడు. కానీ రీమేక్ లు, సీక్వెల్స్ మాత్రం ఆయనకు కలిసి రావడం లేదు. దాదాపు 14 ఏళ్ల తర్వాత శంకర్ చేస్తున్న ఒరిజినల్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. శంకర్ ఈ సినిమాతో తన పాత గుర్తింపును మళ్లీ దక్కించుకోబోతున్నాడు అని సినిమా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన స్పార్క్ ను పునరుద్ధరించి, సాలిడ్ మూవీని అందించగలడని రామ్ చరణ్ అభిమానులకు ఆ అంశం ఆశాకిరణంగా మిగులుతుంది అంటున్నారు.

Exit mobile version