Bhumana Abhinay : భూమన కొడుకుపై ఈసీ కొరడా ఝులిపిస్తుందా? వెంటాడనున్న దొంగ ఓట్ల స్కాం..

Bhumana Abhinay

Bhumana Abhinay

Bhumana Abhinay : ఏ రాజకీయ నాయకుడికైనా తన తర్వాత వారసులు కూడా తనలా ఎదగాలని కోరిక ఉంటుంది. తాము పదవిలో ఉన్నప్పుడే వారసుల లైఫ్ సెట్ చేయాలని భావిస్తూ ఉంటారు. ఇదే ఆలోచనతో తన కుమారుడిని ఎన్నికల్లో పోటీ చేయించి ఎమ్మెల్యేను చేయాలని టీడీడీ సొమ్మును ఇష్టారాజ్యంగా  వాడేసుకుంటున్న భూమన కరుణాకర్ రెడ్డికి గట్టి షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈసీ నిషేధించే పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి కారణం ఎంపీ ఎన్నికల సమయంలో జరిపిన దొంగ ఓట్ల స్కామే.

తిరుపతిలో లోక్ సభ ఉప ఎన్నికల సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్లను ఏమార్చి.. వారి పేర్లతో 30 వేల ఓటర్ కార్డులను డౌన్ లోడ్ చేశారు. వాటి ద్వారా ఫేక్ ఓటర్ ఐడీలను సృష్టించారు. ఈస్కాంపై ఈసీ చాలా సీరియస్ అయ్యింది. ఇప్పటికే ఓ ఐపీఎస్ సహా పలువురు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ కేసును సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. పాత్రధారులు కాదు.. సూత్రధారుల్ని గుర్తించాలన్న లక్ష్యంతో విచారణ జరుగుతోంది. ఈక్రమంలో ఏ-1గా భూమన కుమారుడు అభినయ్ రెడ్డి పేరు తెరపైకి వస్తోంది. మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగినట్లుగా అందరికీ తెలుసు. ఇప్పుడు పోలీసులకు సాక్ష్యాలు కూడా దొరికినట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభుత్వం చేతుల్లోనే అన్ని వ్యవహారాలూ ఉన్నాయి. అందుకే పోలీసులు కాస్త నెమ్మదిగా ఉన్నారు. ఎన్నికల కోడ్ రాగానే ఒక్కసారిగా దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈసీకి సంబంధించిన కేసు కాబట్టి పూర్తి వివరాలు బయట పెడుతారని అంటున్నారు. ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న భూమన అభినయ్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయని, ఆయనపై అనర్హతా చర్యలు తీసుకునే అంశాన్ని కూడా కొట్టిపారేయలేం.

TAGS