Congress Into Power : తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనా?

Congress Into To Power

Congress Into To Power

Congress Into Power : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. దీనికి తోడు అన్ని రకాల సర్వేల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారం సాధిస్తుందని వెల్లడిస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ నాగేశ్వర్ మంత్రి కేటీఆర్ ను ఇదే విషయం గురించి ప్రస్తావించగా ఆయన కూడా ఓటమిని అంగీకరించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి.

బీఆర్ఎస్ కు సొంత పార్టీ విధానాలే తలవంపులు తెచ్చాయి. సీఎం కేసీఆర్ ఏ ఒక్క పని కూడా నెరవేర్చలేదు. ఇచ్చిన వాగ్దానాలు తీర్చలేదు. దీంతో అందరిలో ఆగ్రహం పెరిగింది. బీఆర్ఎస్ ను అధికారంలోకి రానీయకూడదనే అభిప్రాయానికి వచ్చారు. ఇదే ఆ పార్టీకి మైనస్ గా మారిపోయింది. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని పలువురు రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలేవీ తీర్చలేదు. దళితుడిని సీఎం చేస్తానన్నారు. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అని రెచ్చగొట్టారు. చివరకు ఏం చేశారు. తన స్వార్థం చూసుకుని పర్సంటేజీలు వచ్చే పనులు మాత్రమే చేశాడు. ఇలా తెలంగాణ ప్రజలను నట్టేట ముంచాడు. కాళేశ్వరం మళ్లీ నిర్మించాలని సేఫ్టీ అథారిటీ చెప్పడంతో బీఆర్ఎస్ లో కంగారు పుడుతోంది.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 28-31, కాంగ్రెస్ కు 78-82, బీజేపీకి 3-5, ఎంఐఎంకు 5-7 స్థానాలు లభించే అవకాశాలు ఉన్నాయని తేలింది. దీంతో రాబోయే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.  అన్ని సర్వేలు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నట్లు తెలుస్తోంది.

TAGS