BJP : బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో ఈ అవకాశాన్ని వాడుకుంటుందా? 

BJP in general elections

Will BJP use opportunity in General Elections

BJP : సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఇంకా నెలల వ్యవధి మాత్రమే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ సారి కూడా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అందుకు తగ్గట్లుగానే సర్వే రిపోర్టులు వస్తున్నాయి. కేవలం సర్వే రిపోర్టులను మాత్రమే నమ్ముకొని సైలెంట్ గా ఉండకుండా.. శక్తిమేర కృషి చేస్తేనే మరింత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. భవ్య రామమందిరం ప్రారంభోత్సవం (జనవరి 22) తర్వాత ఆ ప్రభ తగ్గక ముందే ఎన్నికలకు వెళ్లాలని మోడీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే దాదాపు ఫిబ్రవరి లాస్ట్, లేదంటే మార్చి ఫస్ట్ వీక్ లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే ఇప్పటికే బీజేపీకి గెలుపు కోసం సన్నాహాలు చేసుకుంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని పరిశీలిస్తే.. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుతో సరిపెట్టుకున్న బీజేపీకి 2023 ఎన్నికల్లో 8 సీట్లు వచ్చాయి. అంటే ఓటు బ్యాంకు ఘనణీయంగా పెరిగిందని చెప్పవచ్చు. వీటితో పాటు చాలా నియోజకవర్గాల్లో బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక సార్వత్రిక ఎన్నికలను పరిశీలిస్తే.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కేవలం 4 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ లెక్కన 2018-2023 అసెంబ్లీ ఓట్ల షేరింగ్ ను బట్టి పరిశీలిస్తే.. ఈ సారి కనీసం 10 సీట్ల వరకు దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది.

ఇటీవల గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 12 ఎంపీ సీట్లను దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. పైగా అధికార పార్టీ కూడా కాబట్టి ఏదో విధంగా దక్కించుకోవాలని చూస్తుంది. అయితే బీజేపీ నాయకులు దీన్ని పరిశీలనలోకి తీసుకొని మరింత గట్టిగా ప్రయత్నించాలి. అయితే ఈ సారి హేమా హేమీలను ప్రజలను పక్కన పెట్టారు. ఈ విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. బండి సంజయ్, అర్వింద్, ఈటల రాజేందర్ లాంటి వారు అసెంబ్లీ సెగ్మెంట్ లో పోటీ చేసి ఓడిపోయారు. దీన్ని కూడాపరిగణలోకి తీసుకొని మరింత కష్ట పడితేనే మోడీ ఛరిష్మా.. బీజేపీ వ్యూహంతో రాష్ట్రంలో మెజారిటీ సీట్లను దక్కించుకునే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తుకుంటున్నారు.

TAGS