BJP Third Time : మూడో సారి బీజేపీ అధికారంలోకి వస్తుందా? జ్యోతిష్యులు ఏం చెబుతున్నారు?

BJP Third Time in Power, Modi and Amith Shah
BJP Third Time : దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో షెడ్యూల్ రాబోతోంది. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే సన్నాహకాలు మొదలుపెట్టాయి. మూడోసారి అధికారంలోకి రావడం పక్కా అంటూ కమలనాథులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఎన్డీఏకు చెక్ పెట్టాలని ఇండియా కూటమి కూడా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. మరి బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా? నరేంద్ర మోదీ మూడోసారి పీఎంగా బాధ్యతలు చేపడుతారా? అనేది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.
హిందూ సంప్రదాయాలను, వాస్తు, జ్యోతిష్యాలను బలంగా నమ్మే కాషాయ దండు జాతకం ఎలా ఉండబోతోంది? అనేది జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు. దాని వివరాలు ఇలా ఉన్నాయి.. బీజేపీ ఏప్రిల్ 6వ తేదీన 1980 సంవత్సరంలో ఉదయం 11గంటల 45 నిమిషాలకు ఢిల్లీలో ప్రారంభించబడింది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు బీజేపీ జాతకాన్ని చూస్తే బీజేపీని స్థాపించినప్పటి రాశి గ్రహ బలాలను బట్టి దీనికి ఓటమిని తారుమారు చేయగల సామర్థ్యం ఉందని చెబుతారు.
రాబోయే ఎన్నికల్లో సైతం బీజేపీకి చాలా అనుకూలమైన వాతావరణమే ఉందని అంటున్నారు. బీజేపీ జాతకంలో జన్మ చార్ట్ లో లగ్నం మరియు వారసుడు ఇద్దరు నాలుగో ఇంట్లో ఉండడంతో మతపరమైన వ్యవహారాలతో పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. అనేక మతపరమైన వ్యవహారాల కారణంగా బీజేపీకి ప్రజల్లో గణనీయమైన ఆదరణ పెరిగిందని జ్యోతిష్య శాస్త్ర అంచనాలు చెబుతున్నాయి.
అయోధ్య రామాలయం నిర్మాణం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ ఉపయోగించుకునే అవకాశం ఉందని, ఫలితంగా బీజేపీ మరోమారు అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉందని అంచనా. ఫిబ్రవరి 16వ తేదీన బీజేపీకి చంద్రుని ప్రధాన కాలంలో బుధుడు ఉపకారానికి ప్రవేశించడంతో గజకేసరి యోగం ఏర్పడింది.
ఈ యోగం ప్రభావంతో రాజకీయ రంగంలో పార్టీ విజయానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ మళ్లీ అధికారాన్ని చేజిక్కుంచుకునే అవకాశం ఉందని, గెలుపు కోసం బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశం ఉందని, ప్రజల్లో గణనీయమైన ఆదరణ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు.