Animal : సందీప్ వంగా, రణబీర్ కపూర్ కాంబోలో వస్తున్న చిత్రం ‘యానిమల్’ ఈ మూవీ విడుదలకు దగ్గరపడుతున్న కొద్దీ ప్రేక్షకుల్లో ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే ప్రీ టీజర్, టీజర్, సాంగ్స్ తో సినిమాలపై అంచనాలు పీక్స్ లో ఉండగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అందరి అంచనాలను మించిపోయింది. ఈ చిత్రం డిసెంబర్ 1వ తేదీ భారతదేశంలో విడుదల కానుండగా, నవంబర్ 30వ తేదీ యూఎస్ లో వెండితెరపై అలరించబోతోంది.
ఒక్క ప్రీమియర్ షోల ద్వారానే దాదాపు మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం 18 షోలకు 128,611 టిక్కెట్లు అమ్ముడుపోగా, ప్రీమియర్ షోలకు 301,778 డాలర్లు (రూ.2.5 కోట్లు) వసూలు చేసింది.
ఈ చిత్రంలో తన పాత్రను నిజ జీవిత అనుభవాలు ఎలా ప్రభావితం చేశాయో రణబీర్ ఇటీవల పంచుకున్నాడు, ‘నేను నా తండ్రిని కోల్పోయాను, తల్లిదండ్రులను కోల్పోయిన ప్రతి ఒక్కరూ వారితో తగినంత సమయం గడపలేదని నేను భావిస్తాను. నేను ఎదుగుతున్నప్పుడు, మా నాన్న చాలా బిజీగా ఉండేవారు- ఎక్కువ సమయం షూటింగ్ చేయడం, డబుల్ షిఫ్టులు చేయడం, ప్రయాణాలు చేయడం. అందుకే ఎక్కడో ఆయన్ను ఎంతో ప్రేమగా, గౌరవంగా చూశాం కానీ మా మధ్య ఎప్పుడూ స్నేహ పూర్వక బంధం లేదు. మేము కూర్చొని కబుర్లు చెప్పుకోలేము, నా జీవితంలో ఈ ఒక్క వెలితి మాత్రం ఉంది. నేను నా తండ్రితో స్నేహంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను అతనితో ప్రతీది పంచుకోవాలని అనుకుంటున్నాను. ఆ పశ్చాత్తాపంతోనే నేను ఎప్పటికీ జీవిస్తాను.’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
రణ్ బీర్ కపూర్ తో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. విక్కీ కౌశల్ నటించిన మేఘనా గుల్జార్ యొక్క ‘సామ్ బహదూర్’తో ఈ మూవీ పోటీ పడనుంది, దేశంలో మొదటి ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్షా కథను, బంగ్లాదేశ్ ఏర్పాటులో అతని పాత్రను ఈ మూవీ వివరిస్తుంది.