Bigg Boss 9 : బిగ్ బాస్ 9 లోకి లేడి అఘోరి?

Bigg Boss 9 Telugu : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఓ సంచలన అంశం హాట్ టాపిక్‌గా మారింది. అదే లేడి అఘోరి వ్యవహారం. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన ఈమె, తాజాగా బిగ్ బాస్ 9లోకి ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం ఒక అమ్మాయిని వివాహం చేసుకుని వీడియోలు విడుదల చేయడంతో ఈ లేడి అఘోరి పేరు మారుమోగిపోయింది. అయితే, ఈ వివాదం సద్దుమణగకముందే ఆమె గతంలో చేసుకున్న మొదటి భార్య బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం మరింత కలకలం రేపింది. అంతేకాకుండా, ‘యోని పూజ’ పేరుతో ఓ మహిళా నిర్మాతను రూ. 10 లక్షలు మోసం చేసిందనే ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి.

ఇలా వరుస వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈ లేడి అఘోరి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెట్టనుందనే సమాచారం ప్రేక్షకుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఎన్నో సంచలనాలకు వేదికైన బిగ్ బాస్ షో, ఈసారి ఈ వివాదాస్పద వ్యక్తి రాకతో మరింత రచ్చగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.

బిగ్ బాస్ నిర్వాహకులు కావాలనే ఈ లేడి అఘోరిని షోలోకి తీసుకువస్తున్నారా? ఆమె రాకతో షో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఒకవైపు ఈ వార్త కొందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంటే, మరికొందరు మాత్రం షో మరింత ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా, లేడి అఘోరి బిగ్ బాస్ 9లోకి వస్తే మాత్రం ఈ సీజన్ మరింత హాట్ టాపిక్‌గా మారడం ఖాయం! చూడాలి మరి, ఈ వార్తల్లో నిజమెంతో వేచి చూడాలి!

TAGS