JAISW News Telugu

Actress Laya : లయ మళ్లీ సినిమాల్లో కనిపించనుందా.. ఆమె తన కూతురును అంత మాట అందా?

Actress Laya

Actress Laya

Actress Laya : స్టార్ హిరోయిన్ లయ అనేక హిట్ సినిమాల్లో నటించి పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయింది. లయ స్వయంవరం సినిమా ద్వారా హిరోయిన్ గా తెరంగ్రేటం చేసింది. అయితే తెలుగు మూవీలో స్వయంవరం అతి పెద్ద హిట్ మూవీ. హిరో వేణు హిరోగా నటించిన ఈ మూవీ సక్సెస్ కావడంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో లయ ఒక వెలుగు వెలిగింది. దాదాపు 10 సంవత్సరాలు హిరోయిన్ గా అనేక సినిమాల్లో నటించి మెప్పించింది.

పెళ్లి అనంతరం ఆమె అమెరికాలోని డాక్టర్ గణేశ్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. అమెరికాకు వెళ్లిన అనంతరం ఆమె సినిమాలకు దూరమైంది. లయకు ఓ కూతురు పుట్టగా అందాల బొమ్మగా ఉంది. లయ కూతురుతో చేసే డ్యాన్సులు, ఫ్యామిలీ ఫోటోలు ఇతర వివరాలు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటుంది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూనే తన హవా కొనసాగించింది.

గ్లామర్ పాత్రలు కాకుండా హోమ్లీ గర్ల్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని తెలుగు ప్రేక్షకుల్లో  సంపాదించుకుంది. లయ తెలుగు సినిమాలో భద్రం కొడుకో మూవీ లో  మొదటి సారి చైల్డ్ ఆర్టిస్లుగా అరంగ్రేటం చేసింది. అనంతరం స్వయంవరం మూవీలో తన నటనతో గుర్తింపు తెచ్చుకుంది. వరుస అవకాశాల్లోనూ ఎక్కడా కూడా తను గ్లామర్ షో చేయలేదు.

ఈ మధ్యే ఇండియాకు వచ్చిన లయ కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో తన కూతురు కూడా సినిమాల్లో నటిస్తే చూడాలని ఉందని కోరికను బయట పెట్టింది. లయ తన కూతురుతో దిగిన ఫొటోను షేర్ చేసింది. అయితే లయ, ఆమె కూతురు ఇద్దరు కలిసి అక్కా చెల్లెళ్లలాగా కనిపిస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు. లయ ఇప్పటికీ ఎంత వయసు వచ్చినా వన్నె తగ్గని అందంతో కనిపిస్తుంది. మళ్లీ అవకాశాలు, సమయం ఉంటే సినిమాల్లో నటిస్తానని చెప్పినా లయ ఇప్పుడైతే అంతా తీరిక లేదని సమయం ఉంటే చూస్తామని చెప్పింది. భర్త బిజీ డాక్టర్ కావడంతో ఆమె కూడా తన లైఫ్ లో బిజీ అయిపోయింది.

Exit mobile version