Husband Died : రైలు నుంచి కిందపడిన భార్య.. కాపాడేందుకు యత్నించి భర్త మృతి

Husband Died
Husband Died : రైలులో నుంచి కిందపడిన భార్యను రక్షించేందుకు యత్నించిన భర్త మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ప్రశాంతి ఎక్స్ ప్రెస్ జనరల్ బోగీలో దంపతులు సయ్యద్ ఆసిఫ్, ఆయన భార్య అసియాబాను ఫుట్ బోర్డుపై కూర్చొని ప్రయాణించారు. ఈ క్రమంలో ఎర్రగుంట్ల వద్ద అసియాబాను నిద్రమత్తులో రైలులో నుంచి కిందపడింది. దీన్ని గమనించిన సయ్యద్ ఆసిఫ్ ఆమెను కాపాడేందుకు రైలు నుంచి దూకి మృతి చెందాడు.
ఈ ఘటనలో మహిళకు తీవ్రగాయాలు కాగా చికిత్స కోసం డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా చిరూరు ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. నాలుగు నెలల క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు నుంచి బెంగళూరు వెళ్తున్నట్లు చెప్పారు.