JAISW News Telugu

CoWIN Certificates : కోవిన్ సర్టిఫికెట్లపై ప్రధాని ఫొటో అందుకే తీసేశారా?

FacebookXLinkedinWhatsapp
CoWIN Certificates

CoWIN Certificates

CoWIN Certificates : కరోనా వైరస్ ప్రపంచాన్ని రెండు సంవత్సరాలు తీవ్రంగా దెబ్బతీసిపోయింది. భారత్ లో ఉచితంగా వ్యాక్సిన్లు అందించి మోదీ ప్రభుత్వం అందరి ప్రాణాలను కాపాడిందని బీజేపీ నేతలు చెబుతుంటారు. అయితే ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫెకెట్ల పై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశంగా మారింది.

దేశంలో విస్తృతంగా వేసిన కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ట్రయల్ రన్ పూర్తికాకముందే వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు ఇచ్చి ఎంతో మంది ప్రజల ప్రాణాలను గాల్లో దీపంలా మార్చారని మండిపడుతున్న వేళ మోదీ కోవిన్ సర్టిఫికెట్లపై తన ఫొటోను తొలగించడం తీవ్ర దుమారం రేపుతోంది.

కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారందరికీ జారీ చేసే కోవిన్ సర్టిఫికెట్లపై ఉండే ప్రధాని మోదీ ఫొటోను తాజాగా తొలగించారు. మనమంతా కలిసి పోరాటం చేస్తే భారత్ కోవిడ్ ను ఓడించగలుగుతుందని మోదీ పేరుతో సర్టిఫికెట్లు ఉండేవి. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఈ సమయంలో ప్రధాని ఫొటో మాయమవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మోదీకా కమల్ అనే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతోనే ఇతర ప్రభుత్వ వెబ్ సైట్లలో ప్రధాని ఫొటో తొలగించినట్లుగానే కోవిన్ పోర్టల్ లోనూ తొలగించారని బీజేపీ నేతలు చెపుతున్నారు.

Exit mobile version