Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై అంత ద్వేషమెందుకు?

Hardik Pandya

Hardik Pandya

Hardik Pandya : హార్దిక్ పాండ్యా అతి తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చకున్నాడు. ఆల్ రౌండర్ గా పలు మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల ఆటగాడు. ప్రతిభ ఉన్నా అతడి ఆటిట్యూడ్ తో విమర్శల పాలవుతుంటాడు. అందుకే సోషల్ మీడియాలో పాండ్యాపై బ్యాడ్ కామెంట్స్ వస్తునే ఉంటాయి. ఇక రోహిత్ ను పక్కనపెట్టి పాండ్యాకు కెప్టెన్సీ అప్పజెప్పడంతో ఇది మరింత పెరిగింది.

వాస్తవానికి హార్దిక్ పాండ్యా మంచి ఆటగాడే అయినప్పటికీ అతడి ఓవర్ యాక్షనే అతడికి బ్యాడ్ ఇమేజ్ తెచ్చింది. ధోనీ, కోహ్లీ, రోహిత్, సచిన్ లాంటి వాళ్లను చూసైనా నేర్చుకోవాల్సింది. కానీ ఏనాడు ఆ పనిచేయలేదు. మ్యాచ్ తర్వాత జరిగే ప్రెస్ మీట్స్ లో పాండ్యా సమాధానాలు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. తన ఆటిట్యూడ్ తో తిక్క తిక్క సమాధానాలు, స్టేట్ మెంట్స్ ఇస్తూ విమర్శలపాలవుతాడు. సీనియర్లకు గౌరవం ఇవ్వరని, ఓవర్ కాన్ఫిడెన్స్ ప్లేయర్ అని కొందరు అభిప్రాయపడుతుంటారు. గాయాల బెడదతో అంతర్జాతీయ మ్యాచ్ లకు దూరమైనా.. ఐపీఎల్ సమయానికి ఫిట్ అవుతాడని కొందరు ఎద్దేవా చేస్తుంటారు.

ఈ నేపథ్యంలో నిన్నటి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై అనూహ్యంగా ఓడిపోవడంతో ముంబై ఫ్యాన్స్ హార్దిక్ ను తిట్టిపోస్తున్నారు. సాధారణ స్కోర్ ను కూడా ఛేజ్ చేయలేయపోవడం, చివరి ఆరు ఓవర్లలో చేతిలో ఏడు వికెట్లు ఉన్నా 48 పరుగులు చేయలేక చతికిలపడడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీనికితోడు పాండ్యా కేవలం  11 పరుగులు చేయడంతో ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.

TAGS