Anupama Wedding : సౌత్ ఇండియన్ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో అనుపమ పరమేశ్వరన్ ముందు వరుసలో ఉంటుంది. ఈమెకి క్యూట్ స్మైల్ కి, రింగుల జుట్టుని చూసి ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. వస్తే అనుపమ లాంటి అమ్మాయి మా జీవితాల్లోకి రావాలి అని కలలు కంటూ ఉంటారు. ఆమె చిన్న ముద్దు సన్నివేశం లో నటించినా, రొమాంటిక్ సన్నివేశం చేసినా అబ్బాయిలు అసలు తట్టుకోలేరు.
ఎందుకంటే అవి మాకు మాత్రమే సొంతం అని పిచ్చి ఊహల్లో తేలుతూ ఉంటారు. ‘అ..ఆ’ అనే సినిమాతో నెగటివ్ రోల్ ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన అనుపమ పరమేశ్వరన్, ఆ తర్వాత హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి సూపర్ హిట్స్ ని అందుకుంది. లేటెస్ట్ గా ఆమె హీరోయిన్ గా నటించిన చిత్రం ‘ఈగల్’ నేడు గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.
ఈ సినిమాలో ఆమె ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. అలా వరుస సూపర్ హిట్స్ తో ముందుకు దూసుకుపోతున్న అనుపమ పరమేశ్వరన్ గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన సంగతి ఇప్పుడు తెలిసింది. గతం లో ఈమె మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి ‘తేజ్ ఐ లవ్ యూ’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా అట్టర్ ఫ్లాప్ అయ్యింది కానీ సాయి ధరమ్ తేజ్, అనుపమ పెయిర్ కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లోనే సాయి ధరమ్ తేజ్ , అనుపమ పరమేశ్వరన్ కి మధ్య మంచి స్నేహం ఏర్పడింది అని, సాయి ధరమ్ తేజ్ ఒక అడుగు ముందుకు వేసి అనుపమ పరమేశ్వరన్ కి ప్రపోజ్ చేసాడని, కానీ అనుపమ పరమేశ్వరన్ మాత్రం తానూ అప్పటికే వేరే అబ్బాయితో ప్రేమలో ఉన్నానని చెప్పి, సాయి ధరమ్ తేజ్ కి క్షమాపణలు చెప్పిందని, అప్పట్లో ఒక వార్త సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని సాయి ధరమ్ తేజ్ అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు కానీ, దానిని ఎవ్వరూ నమ్మలేదు. కచ్చితంగా వీళ్లిద్దరి మధ్య ఎదో జరిగింది అనే అనుకుంటున్నారు. ఆ సినిమా తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రాలేదు.