Rahul Gandhi : నీట్ వివాదంపై ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారు?: రాహుల్ గాంధీ
Rahul Gandhi : పరీక్షల్లో పేపర్ లీకేజీ, అవకతవకలు జరిగాయంటూ వస్తోన్న వార్తలపై పీఎం నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రదాని నరేంద్ర మోదీపై మంగళవారం విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షపై విద్యార్థులు, విపక్షాలు ధర్నాలు చేస్తున్నా ప్రధాని ఎందుకు స్పంచడం లేదని ప్రశ్నించారు. నీట్ పరీక్ష విషయంలో మౌనం వహిస్తున్న ప్రధానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తమ గళాన్ని వినిపిస్తుందన్నారు. పరీక్ష పేపర్ లీక్ లకు వ్యతిరేకంగా బలమైన విధానాల రూపకల్పనకు పార్టమెంటు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ కూటమి పాలిత రాష్ట్రాలైన బీహార్, గుజరాత్, హరియాణాల్లో జరిగిన అరెస్టులు పరీక్షలో అవినీతి జరిగిందని రుజువు చేస్తున్నాయని చెప్పారు.
నీట్ పరీక్షలో 24 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు తారుమారు అయినా పీఎం మోదీ ఏమీ పట్టనట్లుగా మౌనం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పేపర్ లీక్ కు కేంద్రంగా మారాయని మండిపడ్డారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేపర్ లీకేజీలు కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందన్న అంశాన్ని రాహుల్ గాంధీ గుర్తుచేశారు.