Pakistan Players : భారత్ పై పాక్ ఎందుకు అక్కసు వెళ్లగక్కుతోందో తెలుసా?
Pakistan Players : 2023 వరల్డ్ కప్ లో టీమిండియా విజయాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తుంటే దాయాది దేశం పాక్ మాత్రం విమర్శలు చేస్తోంది. భారత్ కుట్రపూరితంగా గెలుస్తోందంటూ బుకాయిస్తోంది. అపనిందలు వేయడమే పనిగా పెట్టుకుంది. మన ఉన్నతిని ఓర్వలేకపోతోంది. పాక్ క్రికెటర్లు చేస్తున్న విమర్శలను ఆ దేశం ఆటగాళ్లే తప్పుబడుతున్నా వారిలో మాత్రం మార్పు రావడం లేదు.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా టీమిండియా గెలుపును తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. టీమిండియా పేసర్లు కట్టడి చేస్తున్నా పాక్ మాత్రం విభిన్న బంతులు వాడుతూ గెలుస్తున్నారంటూ ఆరోపణలు చేయడం గమనార్హం. దీనికి పాక్ క్రికెట్ దిగ్గజం వసీం వీటిని ఖండిస్తున్నాడు. టీమిండియా ఆటతీరులో ఎలాంటి లోపాలు లేవని చెబుతున్నాడు.
ఐసీసీ మ్యాచులాడిన వారు కూడా నిబంధనలను కాదని ఎలా తప్పులు చేస్తారో వారికి అర్థం కాని పరిస్థితి. వసీం అక్రమ్ మత్రం పాక్ క్రికెటర్ల ఆరోపణలను ఖండించాడు. టీమిండియా ఆటను తప్పు పట్టడం మనకు మంచిది కాదని వ్యాఖ్యానించాడు. చివరకు టాస్ ఫిక్సింగ్ అంటూ చిన్న పిల్లల వలే మాట్లాడటంపై వారి మానసిక స్థితి ఏంటో అర్థమవుతుంది. అంతర్జాతీయ మ్యాచ్ అంటేనే నిబంధనలు కఠినంగా ఉంటాయని వారికి తెలియదేమో.
పాక్ క్రికెటర్లు సొంత ఇమేజ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేయడంపై చురకలు అంటించారు. పాక్ క్రికెటర్ల మాటలు వింటుంటే ఆశ్చర్యం వేయక మానదు. ఇలాంటి ఆరోపణలు చేయడం వారికి అలవాటే. వారు ఆడినప్పుడు మనం కూడా ఇలాగే ఆరోపణలు చేశామా? మన ఆలోచనలు వేరు వారి మానసిక స్థితి వేరు. ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడటం వారికి తగదని హితవు పలుకుతున్నారు.