Hanu-Man : ‘హను-మాన్’ సక్సెస్ పై టాప్ హీరోలు ఒక్కరూ మాట్లాడరేం?
అయితే ఈ సినిమాపై కొందరు ఆకతాయిలు ఫేక్ అకౌంట్స్ సృష్టించి తమ సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజా సజ్జా సోషల్ మీడియాలో తమ ఆవేదనను పంచుకున్నారు. ఏదీ ఏమైనప్పటికీ ధర్మమే గెలుస్తుందని, ఇటువంటి చెత్తను భోగి మంటల్లో వేయడం మరిచిపోయాను.. అంటూ ప్రశాంత్ వర్మ హార్ట్ బ్రేక్ సింబల్ తో తన ఆవేదనను వ్యక్తపరిచారు.
దేశ వ్యాప్తంగా మంచి మౌత్ టాక్ నడుస్తున్న టాలీవుడ్ మూవీకి మన సినీ పెద్దలు, స్టార్ హీరోలు ఏ మాత్రం మద్దతు ఇవ్వకపోవడం దురదృష్టకరం. ఒక్క చిరంజీవి మాత్రమే సినిమాకు సపోర్ట్ గా నిలిచారు. ప్రీ రిలేజ్ ఈవెంట్ లో పాల్గొని మూవీ యూనిట్ కు పెద్ద భరోసాగా నిలిచారు. అలాగే కె. రాఘవేంద్రరావు విషెస్ తెలిపారు. ఇంకా తెలుగులో ఉన్న భారీ దర్శక, నిర్మాతలు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి నటులెవరూ ఈ సినిమాపై స్పందించకపోవడం అందరినీ నిరాశ పరుస్తోంది.
తెలుగు కుర్రాళ్లు ఎంతో సాహసం చేసి తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన సినిమా చేశారు. దీనికి మన స్టార్ లు పాజిటివ్ గా స్పందిస్తే సినిమాకు దేశ స్థాయిలో కూడా జనాల్లోకి వెళ్తుంది. గతంలో కాంతారా, కేజీఎఫ్ కూడా ఇలాగే హిట్ అయితే వాటిని ఎంతోమంది సినీ పెద్దలు ప్రశంసించి మీడియాలో దాన్ని ప్రమోట్ చేశారు. అలాగే మొన్నటికి మొన్న అడల్ట్ కంటెంట్, ఓవర్ వాయిలెన్స్ ఉన్న ‘యానిమల్’ మూవీని ప్రమోట్ చేసిన సినీ స్టార్లు.. హనుమాన్ మూవీ విషయంలో ఇలా సైలంట్ అయిపోవడంపై సగటు సినీ అభిమానులు మండిపడుతున్నారు.