Jeelakarra Bellam : పెళ్లంటే నూరేళ్ల పంట. ఆశల జంట. కొత్తగా పెళ్లి చేసుకునే వారు తమ జీవితం ఎలా ఉండాలనే దాని మీద ఊహల్లో తేలుతుంటారు. పెళ్లి అనే పద్ధతిలో తమ జీవిత భాగస్వామిని ఎంచుకోవడం సంతోషంగా భావిస్తారు. తమకు కాబోయే భర్త, భార్య ఎలా ఉండాలనే దాని మీద ఎన్నో కలలు కంటారు. జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకోవడం సహజమే.
పెళ్లిలో జీలకర్ర, బెల్లం ప్రధాన పాత్ర పోషిస్తాయి. పెళ్లి తంతులో ఇది నెత్తి మీద పెట్టి ప్రమాణం చేయిస్తారు. జీలకర్ర, బెల్లం త్వరగా కలిసిపోతాయి. అందుకే దంపతులు కూడా జీవితంలో అలాగే కలిసి పోవాలనే ఉద్దేశంతో వాటిని దంపతుల శిరస్సు మీద పెట్టిస్తారు. జీవితమనే ప్రయాణంలో ఆలుమగలు కూడా అలాగే కలిసిపోవాలనేది వారి అభిప్రాయం.
పెళ్లంటే మంగళస్నానాలు, గౌరీపూజ, కన్యావరణం, ముహూర్తం లాంటివి ఎన్నో తంతులు ఉంటాయి. జీలకర్ర, బెల్లం పెట్టేటప్పుడు వధూవరులు ఒకరినొకరు చూసుకోవాలి. ఒకరి కళల్లో ఒకరు చూసుకుంటూ
స్పర్శను ఎంజాయ్ చేస్తారు. జీలకర్ర, బెల్లం పెట్టే చోటును సహస్రార చక్రం అంటారట. జీలకర్ర, బెల్లం పెట్టగానే సగం పెళ్లి పూర్తయినట్లే అని భావిస్తారు.
దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. జీలకర్ర, బెల్లం ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. చలువదనం చేస్తుంది. రక్తహీనతను దూరం చేస్తుంది. ఇలా ఇన్ని ఆరోగ్య లాభాలుండటంతోనే ఇవి పెళ్లిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. రెండింటిలో మనకు ఎన్నో ప్రయోజనాలు దాగిఉన్నాయి. అందుకే పెళ్లిలో వీటికి ప్రాధాన్యం ఏర్పడింది. వీటితోనే పెళ్లి తంతు మొదలవుతుంది.