Kalki 2898 AD : కల్కి లో పెరుమాళ్ల పాడు ఆలయం గురించి ప్రస్తావన ఎందుకు? కథ ఈ ఆలయం చుట్టేనా తిరుగుతుందా..?
Kalki 2898 AD : కల్కి 2898 ఏడీ చిత్రంపై ప్రభాస్ అభిమానులు పూర్తిగా అంచనాలు పెంచేసుకున్నారు. ప్రభాస్ హిరోగా.. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్చన్ చిత్రం ఇది. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ మూవీలో అనేక కొత్త విశేషాలు దాగి ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీని జూన్ 27 న విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ అన్ని పనులు ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే ట్రైలర్ ను విడుదల చేశారు. దీనికి ఎంతో రెస్పాన్స్ వచ్చింది. విదేశాల్లో కూడా దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. కల్కి షూటింగ్ కు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయం కూడా చిత్రీకరించినట్లు ప్రచారం నడుస్తోంది.
పెరమాళ్లపాడులోని ఈ ఆలయం గురించి ఉందో లేదోననే విషయం సినిమా విడుదల అయితే గానీ తెలియదు. 2020 లో ఇసుక లో కూరుకుపోయిన ఈ ఆలయాన్ని స్థానికులు గుర్తించారు. ఆలయాన్ని బాగు చేయాలని ప్రభుత్వానికి విన్నపం చేసుకున్నారు. 200 ఏండ్ల కింద ఇసుక తుఫాన్ కారణంగా ఈ ఆలయం కూరుకుపోయిందని తెలుస్తోంది.
ఈ ఆలయం కింద వందల ఎకరాల మాన్యం కూడా ఉన్నట్లు సమాచారం. కల్కి మూవీలో బుజ్జి అనే వాహనం హైలైట్ కానుంది. కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హసన్ లాంటి అగ్ర తారలు నటిస్తుండగా.. ప్రభాస్ మెయిన్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మిగతా భారతీయ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. అయితే ఈ పెరుమాళ్లపాడు ఆలయానికి ప్రభాస్ కల్కి మూవీకి ఏం సంబంధం ఉందనేది సినిమాలోనే చూపిస్తారని ప్రచారం జరుగుతోంది. సైన్స్ ఫిక్చన్ మూవీ అయిన ప్రభాస్ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందనేది త్వరలోనే తేలిపోనుంది.