World Television Day : నేడు వరల్డ్ టెలివిజన్ డే. నవంబర్ 21, 1921లో టీవీ కనుగొన్నారు. కానీ 1980 దశకంలోనే టెలివిజన్ ప్రాచుర్యం పొందింది. దాని వాడకం పెరిగింది. అందరి ఇళ్లల్లో టీవీలు కనిపించేవి. మొదట బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి. కాలక్రమంలో కలర్ టీవీలు వచ్చాయి. దీంతో టీవీల ప్రభావం ఎక్కువైంది. ప్రస్తుతం టీవీ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు.
మనం ఇంట్లో కూర్చుని ప్రపంచం మొత్తం చూడొచ్చు. ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. అలా మనకు సదుపాయాలు కల్పించబడ్డాయి. దీంతో టెలివిజన్ వాడకం క్రమంగా పెరిగింది. 1927లో బుల్లితెర రూపాన్ని కనుగొన్నారు. అప్పటి నుంచే బుల్లితెర ప్రసారాలు ప్రారంభమయ్యాయి. కానీ 80వ దశకం వరకు టెలివిజన్ ప్రాధాన్యం పెరగలేదు.
1941లో ప్రకటనల పర్వం మొదలైంది. మన ఇంట్లో కూర్చుని చూసే టీవీ వెనక ఎంత తతంగం ఉందో తెలుస్తోంది. అలా టీవీగా రూపాంతరం చెందేందుకు చాలా సమయం తీసుకుంది. ఇలా టీవీలు మన జీవితంలో ఒక భాగంగా మారాయి. 1996 నుంచి ఇంటింటికో టీవీ వచ్చింది. టెలివిజన్ ప్రసారాలు పెరిగాయి. చానళ్లు పెరిగి ప్రసారాలకు మంచి ఊపు తీసుకొచ్చింది.
1996 నుంచి నవంబర్ 21ని టెలివిజన్ డే గా జరుపుకుంటున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజును వరల్డ్ టెలివిజన్ రోజుగా చేసుకుంటున్నారు. ఇలా టీవీ ప్రసారాలు ఇప్పుడు మార్పు చెందాయి. సినిమాలు, జోకులు, వంటలకు ప్రత్యేక చానళ్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో టెలివిజన్ రంగంలో పలు మార్పులు వస్తున్నాయని తెలుసుకోవాలి.