CM Jagan : మహేష్ సినిమా అంటే సీఎం జగన్ కి ఎందుకు అంత ప్రత్యేకమైన ఇష్టం..?
CM Jagan : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే తారాస్థాయిలో ఉన్నాయి. రేపు పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం ఈ సినిమా తెలుగు వెర్షన్ నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ అవుతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమాపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కాస్త అతి ఇష్టం చూపించిందా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ పండితులు.
టికెట్ హైక్స్ కోసం మూవీ టీం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలకు అప్లై చేసి వారం రోజులు అయ్యింది. తెలంగాణ లో ఎలాగో కచ్చితంగా హైక్స్ వస్తుంది, ఇక ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ సినిమాలకు తప్ప ప్రభుత్వం అందరి హీరోల సినిమాలకు హైక్స్ ఇస్తుంది. ఇది ఎన్నోసార్లు అనుభవం అయ్యింది కూడా. అనుకున్నట్టు గానే ఈ సినిమాకి నిన్న టికెట్ గారికి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.
‘సలార్’ చిత్రం కి ఇచ్చినట్టు కేవలం 40 రూపాయిలు హైక్ ఇస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా 50 రూపాయిల హైక్ ని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఇది అందరికీ కాస్త అన్యాయంగా అనిపించింది. ఎందుకంటే ప్రభాస్ ‘సలార్’ చిత్రం తెలుగు సినిమా గర్వించదగ్గ వసూళ్లను రాబట్టే సత్తా ఉన్న సినిమా. అంతే కాకుండా దానికి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కి కచ్చితంగా టికెట్ హైక్స్ 60 రూపాయిలు ఉండాలి. కానీ కేవలం 40 రూపాయిలు మాత్రమే పెంచి , ప్రభాస్ ఫ్యాన్స్ ని ఆగ్రహానికి గురి అయ్యేలా చేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. గతం లో ‘సర్కారు వారి పాట’ సినిమాకి కూడా #RRR రేంజ్ టికెట్ రేట్స్ ఇచ్చారు.
మహేష్ బాబు మీద ఎందుకు ఇంత ప్రత్యేకమైన ప్రేమ?, అందరూ హీరోలు సమానం అన్నప్పుడూ అందరికీ ఒక్కటే రేట్ ఉండాలి కదా?..పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లో ఉన్నాడు, సీఎం జగన్ కి ప్రత్యర్థి కాబట్టి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతిని ఇవ్వలేదు. కానీ మిగతా హీరోలు ఏమి చేసారు ? వాళ్లలో కేవలం కొందరి పైనే ప్రేమ చూపించి, కొందమంది పైన మాత్రం పక్షపాతం చూపించడం ఎందుకు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ పెదవి విరుస్తున్నారు.